TS LAWCET 2022: తెలంగాణ లా సెట్‌- 2022 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ పెంపు.. ఎప్పటివరకంటే..

తెలంగాణ లా సెట్ 2022కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగిస్తున్నట్లు కన్వీనర్‌ జీబీ రెడ్డి జూన్‌ 7న ఓ ప్రకటనలో తెలిపారు.,

TS LAWCET 2022: తెలంగాణ లా సెట్‌- 2022 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ పెంపు.. ఎప్పటివరకంటే..
Ts Lawcet 2022
Follow us

|

Updated on: Jun 09, 2022 | 3:31 PM

TS LAWCET 2022 Application Last Date: తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి 3, 5 ఏళ్ల లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS LAWCET- 2022), తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TSPGLCET-2022) ఎల్‌ఎల్‌బీతో పాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం (LL.M) కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగిస్తున్నట్లు కన్వీనర్‌ జీబీ రెడ్డి జూన్‌ 7న ఓ ప్రకటనలో తెలిపారు. కాగా తెలంగాణ లాసెట్‌ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 2) విడుదలవగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 6 నుంచి జూన్‌ 6 వరకు కొనసాగుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఐతే విద్యార్ధుల విన్నపం మేరకు దరఖాస్తు గడువును జూన్‌ 16 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్ధులు ఈ సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవల్సిందిగా ఈ మేరకు తెలియజేశారు. ఎల్‌ఎల్‌బీకి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులకు రూ.1000లు దరఖాస్తు ఫీజు నిర్ణయించారు. రూ.500 నుంచి రూ.2 వేల వరకు ఆలస్య రుసుంతో జులై 12 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. పరీక్షలు జులై 21, 22 తేదీల్లో యథాతథంగా జరగనున్నాయి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.