AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet Trains: ఏపీకి అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూటు ఫిక్స్..

ఏపీకి రైల్వేశాఖ సూపర్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మరో రెండు బుల్లెట్ రైల్ కారిడార్ల నిర్మాాణానికి అడుగులు వేస్తోంది. ఇందుకోసం లొకేషన్ సర్వే కోసం అధికారులు రైల్వే బోర్డు అనుమతి కోరారు. ఇటీవల బడ్జెట్‌లో ఏపీ మీదుగా మూడు కారిడార్లను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.

Bullet Trains: ఏపీకి అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూటు ఫిక్స్..
Bullet Train
Venkatrao Lella
|

Updated on: Mar 04, 2026 | 7:25 AM

Share

ఆంధప్రదేశ్‌కు రైల్వేశాఖ మరో భారీ శుభవార్త అందించింది. ఏపీలో పలు ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రకటించిన బడ్జెట్‌లో కేవలం హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా చెన్నై, బెంగళూరుకు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను నిర్మించేందుకు ప్రతిపాదించింది. ఇక చెన్నై-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ చిత్తూరు జిల్లా మీదుగా వెళ్లనుంది. ఇవే కాకుండా ఏపీలో మరో రెండు హైస్పీడ్ రైలు కారిడార్లను నిర్మించాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేయగా.. ఫైనల్ లొకేషన్ సర్వే త్వరలో చేపట్టేందుకు సిద్దమవుతోంది. లొకేషన్ సర్వే నిర్వహించేందుకు అనుమతి కోసం రైల్వే బోర్డుకు రైల్వే అధికారులు ప్రతిపాదన పెట్టారు. రైల్వేబోర్డు నుంచి అనుమతి వచ్చాక అధికారులు సర్వే నిర్వహించనున్నారు.

మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్లు

కేంద్రం ఇటీవల బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లను ప్రకటించింది. ఇందులో ఏపీ నుంచి మూడు లైన్లు వెళ్లనున్నాయి. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళూరు లైన్లు ఏపీ మీదుగా వెళ్లనుండగా.. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ-విశాఖపట్నం మధ్య హైస్పీడ్ రైలు కారిడార్‌ నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఇక విజయవాడ-కర్నూలు మధ్య మరో సెమీ హైస్పీడ్ కారిడార్‌కు సిద్దమవుతోంది. ఇక ఈ రెండు లైన్లతో పాటు మరో ఆరు మార్గాల్లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వేశాఖ సిద్దమవుతోంది. వీటి కోసం త్వరలో సర్వే చేపట్టనుంది. భవిష్యత్తులో రాజధాని అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరిగేలా రైల్వేశాఖ ఈ కొత్త రైల్వేలైన్లకు శ్రీకారం చుట్టింది.

విజయవాడ-విశాఖ హైస్పీడ్ రైలు కారిడార్

విజయవాడ-విశాఖపట్నం హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ 350 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇది ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా విశాఖకు వెళ్తుంది. గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లు ఈ రెండు ప్రాంతాల మధ్య తిరుగుతాయి. ఈ కొత్త కారిడార్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్-అమరావతి-చెన్నై కారిడార్‌కు ఇది కనెక్ట్ అవుతుంది. దీంతో అమరావతి నుంచి చెన్నై, బెంగళూరుకు బుల్లెట్ రైల్ కనెక్టివిటీ మరింత పెరగనుంది. ఇక విజయవాడ-కర్నూలు మధ్య ప్రస్తుతం నేరుగా ప్రయాణించేందుకు రైళ్లు లేవు. డోన్ లేదా నంద్యాలలో దిగి కర్నూలుకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఈ రెండు ప్రాంతాలకు నేరుగా ప్రయాణించేందుకు విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మించడంపై రైల్వేశాఖ దృష్టి పెట్టింది. . గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, కంభం, నంద్యాల మీదుగా ఇది వెళ్తుంది.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర