RBI Assistant Mains Results 2022: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మెయిన్స్ ఫలితాలు విడుదల..
ఆర్బీఐ అసిస్టెంట్ మెయిన్స్ పరీక్షల ఫలితాలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం (జూన్ 8) ప్రకటించింది. అర్హులైన అభ్యర్ధుల..
RBI Assistant Mains Results 2022: ఆర్బీఐ అసిస్టెంట్ మెయిన్స్ పరీక్షల ఫలితాలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం (జూన్ 8) ప్రకటించింది. అర్హులైన అభ్యర్ధుల రోల్ నంబర్లతో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను వెల్లడించింది. పరీక్షకు హాజరయిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో opportunities.rbi.org.in. చెక్ చేసుకోవచ్చు. కాగా ప్రిమిలనరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు మే 8 న అసిస్టెంట్ మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. మొత్తం 950 అసిస్టెంట్ పోస్టులకుగానూ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ కొనసాగుతోంది. మెయిన్ స్కోర్ కార్డు త్వరలో విడుదలవ్వనున్నాయి. రోల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌తోపాటు పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్‌లను నమోదు చేయడం ద్వారా స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
RBI Assistant Result 2022 ఎలా చెక్ చేసుకోవాలంటే..
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ chances.rbi.org.inను ఓపెన్ చెయ్యాలి.
- RBI assistant mains result 2022 లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ స్క్రీన్‌పై ఓపెన్ అవుతుంది.
- సేవ్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.