Indian Army Recruitment 2022: పదో తరగతి అర్హతతో.. ఇండియన్‌ ఆర్మీ మిలిటరీ హాస్పిటల్‌లో 65 గ్రూప్‌-సీ ఉద్యోగాలు..

ఇండియన్ ఆర్మీకి చెందిన సదరన్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్ పరిధిలోనున్న చెన్నైలోని మిలిటరీ హాస్పిటల్‌ (Chennai Military Hospital).. గ్రూప్‌ - సీ పోస్టు (Group C posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Indian Army Recruitment 2022: పదో తరగతి అర్హతతో.. ఇండియన్‌ ఆర్మీ మిలిటరీ హాస్పిటల్‌లో 65 గ్రూప్‌-సీ ఉద్యోగాలు..
Indian Army
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 09, 2022 | 6:36 PM

Army HQ Southern Command Group C Recruitment 2022: ఇండియన్ ఆర్మీకి చెందిన సదరన్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్ పరిధిలోనున్న చెన్నైలోని మిలిటరీ హాస్పిటల్‌ (Chennai Military Hospital).. గ్రూప్‌ – సీ పోస్టు (Group C posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 65

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • ట్రేడ్స్‌మెన్‌ మేట్ పోస్టులు: 26
  • వాషర్‌మెన్‌ పోస్టులు: 39

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టునుబట్టి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఫిజికల్‌ టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకుగానూ 2 గంటల సమయంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు సమాధానాలు రాయవల్సి ఉంటుంది.

  • జనరల్‌ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్‌ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు
  • జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు
  • జనరల్‌ ఇంగ్లిష్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు
  • న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు రుసుము: రూ.100

అడ్రస్: The Commandant, Military Hospital, Defence Colony Road. Chennai, Tamil Nadu, Pin – 600032.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 26, 2022. (నోటిఫికేషన్‌ విడుదలైన రోజు నుంచి 45 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి)

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.