AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Teaser: మీ చూపుకు అగ్నిపరీక్ష..! ఈ పెళ్లిలో ఓ ఏలియన్‌ ఉంది.. 7 సెకన్లలో గుర్తించండి

ఒక బ్రెయిన్‌ గేమ్‌ ఛాలెంజ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియలో వైరల్ అవుతుంది. సాధారణంగా సమస్యను బహుళ కోణాల నుంచి విశ్లేషించిన తర్వాత పరిష్కారం లభిస్తుంది. సమస్యను పరిష్కరించడానికి మెదడు విజువలైజేషన్, తార్కికం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి..

Brain Teaser: మీ చూపుకు అగ్నిపరీక్ష..! ఈ పెళ్లిలో ఓ ఏలియన్‌ ఉంది.. 7 సెకన్లలో గుర్తించండి
Wedding Brain Teaser Challenge
Srilakshmi C
|

Updated on: Feb 18, 2026 | 6:49 PM

Share

పదునైన చూపు సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుంది. అటువంటి షార్ప్‌ చూపు ఉన్నప్పుడే సామాన్యులు విజేతలవుతారు. సూక్ష్మదృష్టి అలవరచుకోవాలంటే ప్రత్యేక సాధన అవసరం. ఇటువంటి వాటికి బ్రెయిన్ టీజర్స్ భలేగా ఉపయోగపడతాయి. వీటిల్లో వినోదం కంటే సవాలు మరింత మజాగా ఉంటుంది. ఖాళీ సమయాల్లో ఇలాంటి పజిల్స్ మీకు మానసిక వ్యాయామాన్ని అందిస్తాయి. అంతేకాకుండా ఈ పజిల్స్‌కు సైన్స్ పరిశోధనలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. అలాంటి ఒక బ్రెయిన్‌ గేమ్‌ ఛాలెంజ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియలో వైరల్ అవుతుంది. సాధారణంగా సమస్యను బహుళ కోణాల నుంచి విశ్లేషించిన తర్వాత పరిష్కారం లభిస్తుంది. సమస్యను పరిష్కరించడానికి మెదడు విజువలైజేషన్, తార్కికం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

ఇక్కడ ఇచ్చిన ఫొటోలో ఓ వెడ్డింగ్‌ ఫంక్షన్‌ జరుగుతుంది. అయితే ఇందులో ఓ జంట, కొంతమంది అతిథులు ఉన్నారు. మొదటి చూపులో అందరూ సాధారణంగా కనిపిస్తారు. కానీ ఈ చిత్రంలో ఒక వ్యక్తి మనిషి కాదు. ఇందులో ఓ గ్రహాంతరవాసి అదే ఏలియన్‌ ఉన్నారు. ఈ ఛాలెంజ్‌ చూసేందుకు సరళమైనదిగా కనిపించవచ్చు కానీ కష్టమైనది. అంటే వీరిలో ఎవరు ఏలియన్‌ అనే విషయం కేవలం 7 సెకన్లలో కనుక్కోవాలి. ఈ పజిల్ మీ మెదడు దృశ్య శబ్దాన్ని ఎంత త్వరగా ఫిల్టర్ చేయగలదో, సూక్ష్మమైన అవకతవకలను ఎంత ఫాస్ట్‌గా గుర్తించగలదో పరీక్షిస్తుంది. మీరు ఎంత త్వరగా గుర్తిస్తే మీ చూపు అంత బలంగా ఉంటుందని అర్ధం. 7 సెకన్లలో ఎవరు ఏలియన్ అనేది ఈ బ్రెయిన్ టీజర్ ఛాలెంజ్‌. స్టార్ట్ చేద్దామా..

Wedding Brain Teaser

ఇవి కూడా చదవండి

కనిపెట్టారా? మీ సమాధానం కాదు.. అయితే చింతించకుండా ఈ పై ఫొటో చూసేయండి. ఈ వెడ్డింగ్‌ ఫంక్షన్‌లో ఉన్న గ్రహాంతర వాసి ఎవరో కాదు.. వధువు. అవును.. ఆమెకు మూడు చేతులు ఉన్నాయి. ఇప్పుడు ఫొటోనే మరోమారు క్షుణ్ణంగా చూడండి. వధువుకు మూడు చేతులు కనిపించాయి కదా..! అభిజ్ఞా శిక్షణలో ఇలాంటి ఫిజిల్స్‌ ఉంటాయి. ఇవి నిరంతర శ్రద్ధ, సరళమైన ఆలోచన, దృశ్య జ్ఞాపకశక్తి, దోష గుర్తింపు వంటివి పెంపొందిస్తాయి.

మరిన్ని ట్రెండింగ్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us