PM Modi: దియోఘర్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన జార్ఖండ్‌ వాసులు..

కొత్తగా 657 ఎకరాల విస్తీర్ణంలో, రూ.401 కోట్లతో నిర్మించిన దియోఘర్ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. విమానాశ్రయంలో డియోఘర్ నుంచి కోల్‌కతాకు ప్రారంభమైన ఇండిగో విమాన సర్వీసుకు కూడా ఫ్లాగ్ ఆఫ్ చేశారు.

PM Modi: దియోఘర్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన జార్ఖండ్‌ వాసులు..
Pm Narendra Modi
Follow us

|

Updated on: Jul 12, 2022 | 3:43 PM

PM Modi inaugurates Deoghar Airport: జార్ఖండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. డియోఘర్ చేరుకున్న ప్రధాని మోడీకి జార్ఖండ్ వాసులు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఘన స్వాగతం పలకగా.. ఆయన అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. జార్ఖండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ మంగళవారం రూ.16,800 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీనిలో కొత్తగా 657 ఎకరాల విస్తీర్ణంలో, రూ.401 కోట్లతో నిర్మించిన దియోఘర్ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. కొత్త విమానాశ్రయంలో డియోఘర్ నుంచి కోల్‌కతాకు ప్రారంభమైన ఇండిగో విమాన సర్వీసుకు కూడా మోడీ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ విమానాశ్రయం రన్‌వే, 2,500 మీటర్ల పొడవు, ఎయిర్‌బస్ A320 విమానం ల్యాండింగ్, టేకాఫ్‌కు సదుపాయాన్ని కలిగి ఉంటుంది. మే 25, 2018న డియోఘర్ బాబా బైద్యనాథ్ విమానాశ్రయానికి మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఈ విమానాశ్రయాన్ని రాంచీ, పాట్నా, ఢిల్లీ నగరాలకు అనుసంధానం చేస్తామని వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. 2010లో విజన్‌ చేసిన ఈ ఎయిర్‌పోర్టు కలను ప్రధాని మోదీ నెరవేర్చారంటూ కొనియాడారు. ఇది తమకు గర్వకారణమని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పేర్కొన్నారు.

కొత్త డియోఘర్ విమానాశ్రయం ఈ ప్రాంతంలో కనెక్టివిటీని పెంచుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మట్లాడుతూ. ఈ విమానాశ్రయం కోల్‌కతా, పాట్నా, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాలకు విమాన సర్వీసులను అందించడంతోపాటు.. వేగవంతమైన కనెక్టవిటీని అందిస్తుందని తెలిపారు. రెండు విజయవంతమైన ఫ్లైట్ రన్ ట్రయల్స్ తర్వాత కార్యకలాపాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. జూలై 12న జార్ఖండ్‌లోని కోల్‌కతా, డియోఘర్ మధ్య విమానాలను నడుపనున్నట్లు ఇండిగో ప్రకటించింది. జూలై 12 నుంచి డియోఘర్చ, కోల్‌కతా మధ్య నాలుగు వారంతపు విమానాలు ఉంటాయని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

జార్ఖండ్ రాష్ట్రంలో దేవఘర్ రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం. రాంచీ తర్వాత ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పించడమే లక్ష్యంతో బైద్యనాథ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను ప్రారంభించారు. బాబా బైద్యనాథ్ ధామ్, పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి.

కాగా.. జార్ఖండ్‌లోని దియోఘర్‌ వచ్చిన ప్రధాని మోడీకి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకి ఇరువైపులా భారీగా నిల్చొని ఉన్న ప్రజలకు ప్రధాని మోడీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

వీడియో.. 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి