National flag : వాహ్​.. త్రివర్ణ పతాకాన్ని తలపించే ‘ప్రకృతి’ అందం..! ప్రభుత్వమే షేర్ చేసిన  చిత్రం భలా..!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రం భారతీయుల హృదయాలను గెలుచుకుంది..ఇది అచ్చంగా భారతదేశ జాతీయ జెండాను పోలి ఉంది.

National flag : వాహ్​.. త్రివర్ణ పతాకాన్ని తలపించే ‘ప్రకృతి’ అందం..! ప్రభుత్వమే షేర్ చేసిన  చిత్రం భలా..!
National Flag
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 12, 2022 | 2:04 PM

National flag : దేశభక్తి, ప్రకృతి అందాలు ఒకచోటకి చేరితే? ఆ దృశ్యం చూసేందుకు రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు.. జాతీయ జెండాను తలపించేలా.. ప్రకృతి అందాలు ఆవిష్కృతమైన అద్భుత ఫోటోను ‘నేచర్ ఫ్లౌంటింగ్ త్రివర్ణ’: భారత జెండాను పోలిన దృశ్యం యొక్క ఫోటోను ప్రభుత్వం షేర్ చేసింది. ఈ చిత్రం భారతదేశ జాతీయ జెండాను పోలి ఉండే ప్రకృతి త్రివర్ణ సృష్టిని వర్ణిస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రం భారతీయుల హృదయాలను గెలుచుకుంది..ఇది అచ్చంగా భారతదేశ జాతీయ జెండాను పోలి ఉంది. ఈ చిత్రం – ఫోటో ఫ్రేమ్ లాగా ఉంది – భారత ప్రభుత్వం ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇది భారతీయ జెండా యొక్క మూడు రంగులలో తడిసినట్లుగా కనిపించే సముద్ర దృశ్యాన్ని చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఫోటోను జూన్ 22న అమృత్ మహోత్సవ్ అనే హ్యాండిల్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. కానీ ఇప్పుడు వైరల్ అవుతోంది. చుట్టూ పచ్చదనం, మధ్యలో తెల్లటి సముద్రపు అలలు, కాషాయం రంగులోని సూర్యుడి కిరణాలు.. వీటన్నింటినీ కలిపి చూస్తే.. త్రివర్ణ పతాకం ఆవిష్కృతమవుతుంది. ‘మన గర్వం, మన గౌరవం, ప్రకృతిలో త్రివర్ణ పతాకం’ అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్​ పెట్టింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి