Shocking Video: డేంజరస్ డ్రైవింగ్.. చూస్తే షాక్ అవుతారు.. వైరలవుతున్న వీడియో..
రోడ్డు ప్రమాదాలు చాలా సందర్భాలలో ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవటం వల్లే జరుగుతుంటాయి. అలాంటి సమయాల్లో కేవలం నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నవారు మాత్రమే కాదు, ఎదుటి వారు సైతం ప్రమాద బాధితులు కావాల్సి ఉంటుంది.
దేశంలో ప్రతిరోజూ వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రమాదాల్లో కొందరు తీవ్రమైన గాయాలతో ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు అదృష్టవంతులు భయంకరమైన ప్రమాదాల్లో కూడా ప్రాణాలతో బయటపడుతుంటారు. రోడ్డు ప్రమాదాలు చాలా సందర్భాలలో ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవటం వల్లే జరుగుతుంటాయి. అలాంటి సమయాల్లో కేవలం నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నవారు మాత్రమే కాదు, ఎదుటి వారు సైతం ప్రమాద బాధితులు కావాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కరెక్ట్‌గా వెళ్తున్నప్పటికీ ఎదుటి వారి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం బారిన పడాల్సి వస్తుంది. ప్రస్తుతం అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదుపుతప్పి వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్‌ను ఢీకొట్టింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
ఈ షాకింగ్ ఆక్సిడెంట్ ఘటన ధర్మశాలలోని బాడోల్ గ్రామ సమీపంలో జరిగినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్లిప్ కేవలం 57 సెకన్లు మాత్రమే. అయితే పికప్ వ్యాన్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన తీరును వీడియోలో చూస్తే గుండె జల్లుమంటుంది. వీడియో ప్రారంభంలో మీరు రోడ్డు పక్కన ఒక కారు పార్క్ చేయడాన్ని చూడవచ్చు. అదే సమయంలో ఒక పికప్ వ్యాన్ అటుగా వెళుతుంది. ఆ మరుక్షణంలోనే వేగంగా వస్తున్న ఎరుపు రంగు కారు అదుపు తప్పి ముందు నుండి నేరుగా వస్తున్న పికప్ వ్యాన్‌ని ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన వేగానికి పికప్ వ్యాన్ కొన్ని అడుగుల ఎత్తుకు ఎగిరిపడింది. ఆ తర్వాత కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న తెల్లటి కారును కూడా ఢీకొట్టింది.
వీడియో చూస్తే ఈ ప్రమాదం జరిగిన రోడ్డుపై కాసేపటి క్రితం భారీ వర్షం కురిసి ఉంటుందని ఊహించవచ్చు. ఎందుకంటే రోడ్డు మొత్తం తడిగా ఉంది. ఇదిలావుండగా, కారు డ్రైవర్ తన కారును అతి వేగంతో నడుపుతున్నాడు. పికప్ వ్యాన్‌ను ఢీకొట్టిన తర్వాత రోడ్డు పక్కన ఆగి ఉన్న కారుపైకి అతను ఎలా దూసుకెళ్లాడో మీరు చూడవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. లేట్ అయిన పర్లేదు గురూ కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అది మీకు, మీ పక్కవారికి కూడా శ్రేయస్కరం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి