స్మశానంలో పాతిపెట్టిన సమాధిలోంచి చిన్నారి ఏడుపు శబ్ధాలు.. తవ్వి చూస్తే మూడేళ్ల బాలిక ప్రత్యక్షం

శ్మశానవాటిక నుంచి ఓ చిన్నారి ఏడుపు శబ్ధం వినిపించింది. దాంతో చుట్టుపక్కల కట్టెలు ఏరుతున్న స్థానికులు అక్కడ పరిశీలించి చూడగా, అక్కడే ఓ చోట పూడ్చిపెట్టిన ఓ సమాధిపై మట్టి కదులుతూ కనిపించిది.

స్మశానంలో పాతిపెట్టిన సమాధిలోంచి చిన్నారి ఏడుపు శబ్ధాలు.. తవ్వి చూస్తే మూడేళ్ల బాలిక ప్రత్యక్షం
Mother Buried
Follow us

|

Updated on: Jul 12, 2022 | 9:59 AM

అదో స్మశాన వాటిక.. చుట్టు పక్కల దట్టమైన చెట్లతో కాస్త నిర్మానుష్య ప్రాంతంగా కనిపిస్తుంది. అటుగా వెళ్తున్న వాహనదారులు, కట్టెల కోసం వచ్చిన స్థానిక మహిళలకు అక్కడ ఓ షాకింగ్‌ సీన్‌ కనిపించింది. శ్మశానవాటిక నుంచి ఓ చిన్నారి ఏడుపు శబ్ధం వినిపించింది. దాంతో చుట్టుపక్కల కట్టెలు ఏరుతున్న స్థానికులు అక్కడ పరిశీలించి చూడగా, అక్కడే ఓ చోట పూడ్చిపెట్టిన ఓ సమాధిపై మట్టి కదులుతూ కనిపించిది. దాంతో వారంతా భయంతో పరుగులు తీశారు. పైకి ఉబికి వస్తున్న మట్టి, బిగ్గరగా వస్తున్న చిన్నారి ఏడుపులు విన్న మహిళలు దెయ్యం అనుకుని భయపడి పారిపోయారు. వెంటనే విషయం గ్రామస్తులకు వివరించారు. ఊరందరినీ తీసుకుని స్మశాన వాటిక వద్దకు చేరుకున్నారు. అక్కడ కదులుతున్న మట్టిని తవ్వి చూడగా ఓ చిన్నారి కనిపించింది. బాలిక తీవ్రమైన గాయాలతో భయపడుతూ, నోట్లోంచి మాటలు కూడా రాలేనంతగా భయంతో ఉంది.

బాలికను చేరదీసిన స్థానికులు ఆమెకు మంచినీళ్లు తాగించి, ఆహారం తినిపించారు. అనంతరం చిన్నారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే, ఆ చిన్నారి పేరు..లాలీ అని, తండ్రి, తల్లి పేరు రాజు శర్మ, రేఖా దేవి అని చెప్పింది. తనకు ఏం జరిగిందో వివరిస్తూ..ఆ బిడ్డ చెప్పిన మాటలకు అక్కడున్న వారంతా కంగుతిన్నారు. పాప కష్టానికి ప్రతిఒక్కరూ చలించిపోయారు. అమ్మా, నానమ్మ కలిసి తనను బయటకు వెళ్దామని చెప్పి తీసుకొచ్చి మట్టిలో పూడ్చిపెట్టారంటూ ఆ చిన్నారి బోరున ఏడుస్తూ చెప్పింది. ఊరు పేరు అడిగితే ఆ ఊరి పేరు సరిగా చెప్పలేకపోయింది చిన్నారి. బాలికను మట్టిలో పూడ్చిపెట్టారనే ఈ ఘటన ఆ ప్రాంతమంతా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక తల్లికి అంత కఠిన హృదయం ఎలా ఉంటుంది.. అంటూ స్థానికులు వాపోయారు.

ఇవి కూడా చదవండి
Chapra Bihar

ఛప్రా జిల్లా కోపా గ్రామానికి చెందిన మర్హా నది ఒడ్డున ఉన్న స్మశానవాటికలో ఈ ఘటన వెలుగు చూసింది. 3 ఏళ్ల బాలికను గొంతు కోసి చంపడానికి ప్రయత్నించారు చిన్నారి తల్లి, నానమ్మ అనంతరం బాలికను భూమిలో పాతిపెట్టారు. తల్లి తన గొంతుకోస్తుంటే..గట్టిగా ఏడ్చానని దాంతో నానమ్మ నా నోట్లో మట్టి పోసిందంటూ బాలిక భయపడుతూ చెప్పింది. బాలికను బయటకు తీసిన తర్వాత ప్రజలు కోపా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పెట్రోలింగ్‌ బృందంలోని ఏఎస్‌ఐ రవీందర్‌ సింగ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ప్రథమ చికిత్స అనంతరం కోపా పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం సదర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆశా వర్కర్‌ ఆధ్వర్యంలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని కోపా పోలీసులు తెలిపారు.

Chapra

ఇది నిజంగాఅమ్మ ప్రేమకు అవమానం కలిగించే ఘటన. ముక్కుపచ్చల్లారని మూడేళ్ల చిన్నారిని ఓ తల్లి, నానమ్మ కలిసి సజీవంగా సమాధిలో పూడ్చిపెట్టారు. హృదయ విదారకమైన ఈ సంఘటనపై స్థానిక ప్రజలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ విషయంలోనే చివరికి మానవ మృగాలుగా మారిపోయి దారుణంగా ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులను దారుణంగా తల్లులే ప్రాణాలు తీస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇక్కడ జరిగిన ఘటన అమ్మతనానికి అవమానం మానవత్వానికి మచ్చ తెచ్చే సంఘటన అంటూ ప్రజలు మండిపడుతున్నారు.

మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి