Bird With Hangover : మద్యం మత్తులో తూలుతున్న పక్షి.. హ్యాంగోవర్ అంటే ఇదే గురూ..! అంటున్న నెటిజనం

కొన్ని సందర్భాల్లో కళ్లు తాగిన కోతులు చేసే అల్లరి పనులు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటాయి. అలాంటి మరో వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. మత్తులో తూగిపోతున్న ఓ మాగ్పీ పక్షి

Bird With Hangover : మద్యం మత్తులో తూలుతున్న పక్షి.. హ్యాంగోవర్ అంటే ఇదే గురూ..! అంటున్న నెటిజనం
Magpie
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 11, 2022 | 1:53 PM

Bird With Hangover : ప్రతిరోజూ జంతువులకు సంబంధించిన వైరల్ వీడియోలను మనం ఇంటర్నెట్ లో చూస్తుంటాం.. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే… మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో కళ్లు తాగిన కోతులు చేసే అల్లరి పనులు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటాయి. అలాంటి మరో వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. మత్తులో తూగిపోతున్న ఓ మాగ్పీ పక్షి ఊగుతూ, తూలుతూ తిరుగుతున్న వీడియో నెటిజన్లను షాక్‌ అయ్యేలా చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియో ‘నార్వే దేశంలోని టెలెమార్క్ అక్కెర్ హాగెన్ ప్రాంతంలో ఆపిల్ తోటకు చెందినదిగా తెలిసింది. తోటలో కింద రాలి పడి పులిసిపోయిన ఆపిల్ పండ్లను ఈ మాగ్పీ అనే పక్షి తిన్నది. ఇక అంతే ఆ పండ్లు తిన్న పక్షికి మత్తు నశాలనికి అంటింది…అది తెలియక ఆ పండ్లు తిన్న మత్తులో పక్షి సరిగ్గా నడవలేకపోతోంది.

ఈ వీడియోను ఇప్పటివరకు 17 లక్షల మంది చూశారు. హ్యాంగోవర్‌ అంటే ఇదే గురూ.. హ్యాంగోవర్‌ తో ఈ పక్షి సరిగ్గా నడవలేక అటూ ఇటూ తూలుతూ పడిపోతోంది. ఈ వీడియో పాతదైనా సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండింగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి