Rare snake: వెంకన్న ఆలయ రాజగోపురం వద్ద అరుదైన పాము ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన భక్తులు..

వెంకన్న ఆలయం పడమర రాజగోపురం వద్ద పొడపాము పిల్ల హల్‌చల్‌ చేసింది. ఆలయ రాజగోపురం తలుపులో చుట్టుకుని పడుకున్న పాము పిల్లను చూసి భక్తులు

Rare snake: వెంకన్న ఆలయ రాజగోపురం వద్ద అరుదైన పాము ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన భక్తులు..
Rare Snake
Follow us

|

Updated on: Jul 11, 2022 | 12:55 PM

బుస్‌.. బుస్‌ అంటూ పాములు బుసలు కొడుతున్నాయి. వర్షాకాలం.. పాములకు సీజన్‌ కావడంతో రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఏదో రకమైన పాము కనిపించి హల్‌చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా లంక గ్రామాల్లో పాముల బెడద మరీ ఎక్కువ. పాము కాటుకు గురై ప్రతి సంవత్సరం ప్రజలు ప్రాణాపాయ స్థితిలో పడుతున్నారు. మరికొందరు పరిస్థితి విషమించటంతో మృత్యువాత పడుతున్నారు. వరదల కారణంగా పాములు తరచూ జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో అరుదైన పాము కలకలం రేపింది. పవిత్ర వెంకన్న ఆలయంలో పాము మాటు వేసి ఉండటం గమనించిన ఆలయ సిబ్బంది, భక్తులు భయంతో పరుగులు తీశారు.

ద్వారకా తిరుమల వెంకన్న ఆలయంలో అరుదైన పొడపాము పిల్ల ప్రత్యక్షమైంది. వెంకన్న ఆలయం పడమర రాజగోపురం వద్ద పొడపాము పిల్ల హల్‌చల్‌ చేసింది. ఆలయ రాజగోపురం తలుపులో చుట్టుకుని పడుకున్న పాము పిల్లను చూసి భక్తులు తొలుత భయపడిపోయారు. ఎక్కడ తమను కాటు వేస్తుందోనని కంగారుపడి అరుపులు, కేకలు వేస్తూ బయటకు పరుగు తీశారు. పామును గుర్తించిన ఆలయ అధికారులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం చేరవేశారు. దాంతో హుటాహుటినా పాము ఉన్న ప్రదేశానికి చేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో పామును కొట్టి చంపేశారు. వర్షా కాలం పాముల సంచారం ఎక్కువ కాబట్టి ..ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి