Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny video: తాబేలుపై స్వారీ చేస్తున్న ఎలుక.. ఎక్కడికో షీకారు మరీ.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే

తాబేలు, ఎలుకకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చూడటానికి చాలా క్యూట్ గా ఉంది. ఇలాంటి దృశ్యాన్ని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఇది చాలా ఫన్నీగా ఉంది. మీరు బాగా ఎంజాయ్‌ చేస్తారు.

Funny video: తాబేలుపై స్వారీ చేస్తున్న ఎలుక..  ఎక్కడికో షీకారు మరీ.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Rat Rides On Turtle
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 11, 2022 | 10:33 AM

Viral Video Today: ప్రతిరోజూ జంతువులకు సంబంధించిన వైరల్ వీడియోలను మనం ఇంటర్నెట్ లో చూస్తాం. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే… మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తాయి. తాజాగా తాబేలు, ఎలుకకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చూడటానికి చాలా క్యూట్ గా ఉంది ఈ వీడియో.అందులో ఎలుక తాబేలుపై స్వారీ చేస్తూ కనిపిస్తుంది. సాధారణంగా, ఎలుకలు మనుషులను లేదా మరేదైనా జంతువును చూడగానే పారిపోతాయి, కానీ ఇక్కడ పూర్తిగా భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది చూసిన తర్వాత మీరు కూడా తప్పక నవ్వుకుంటున్నారు…. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. కామెంట్ల వర్షం కురుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తాబేలు వెనుక భాగంలో ఎలుక ఎలా కూర్చుందో మనం వీడియోలో చూడొచ్చు. తాబేలు కూడా హాయిగా కదులుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. తాబేలుకు కానీ, ఎలుకకు కానీ ఎలాంటి సమస్య లేదు. ఇద్దరూ సరిగ్గా ‘బిక్రమ్-బేతాల్’ లాగా ఉన్నారు. బేతాల్ బిక్రమ్ వీపుపై ఎలా తిరుగుతుందో అదే విధంగా, ఇందులో కూడా ఎలుక తాబేలు వీపుపై ఎక్కి తిరుగుతుంది. ఇలాంటి దృశ్యాన్ని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఇది చాలా ఫన్నీగా ఉంది. మీరు బాగా ఎంజాయ్‌ చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో @buitengebieden అనే ID తో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్‌ చేయబడింది. కేవలం 6 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 3 లక్షలకు పైగా వీక్షించారు. 17 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో వీడియో చూసిన ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. తాబేలును ‘టాక్సీ డ్రైవర్’ అని కొందరు, ‘ఫ్రీ రైడ్ ఎవరికి ఇష్టం ఉండదు’ అని కొందరు అంటున్నారు. ఈ కారు ఖచ్చితంగా నెమ్మదిగా వెళ్తుందంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి