ఒడిలో తమ్ముడి శవంతో అంబులెన్స్ కోసం ఎదురుచూస్తున్న 8ఏళ్ల చిన్నారి.. కనీళ్లు పెట్టిస్తున్న వీడియో..
8 ఏళ్ల బాలుడు తన 3 ఏళ్ల తమ్ముడి మృతదేహాన్ని తన ఒడిలో పెట్టుకుని కూర్చుని కనిపించాడు. అతని కుటుంబం అంబులెన్స్ కోసం వెతుకుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
మానవత్వం చచ్చిపోయింది! 8 ఏళ్ల చిన్నారి తన ఒడిలో తమ్ముడి మృతదేహాన్ని పెట్టుకుని కూర్చున్న వీడియో భావోద్వేగానికి గురి చేస్తుంది. చిన్నారి చేతుల్లో ప్రాణం లేని తమ్ముడితో నిస్సహాయంగా కూర్చుని ఉన్న ఆ అన్నకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో, బాలుడు గోడకు ఒరిగి నేలపై కూర్చుని, దహన సంస్కారాల కోసం తన తమ్ముడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నాడు. ఈ హృదయవిదారక సంఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. ఇక్కడి మొరెనాలో 8 ఏళ్ల బాలుడు తన 3 ఏళ్ల తమ్ముడి మృతదేహాన్ని తన ఒడిలో పెట్టుకుని కూర్చుని కనిపించాడు. అతని కుటుంబం అంబులెన్స్ కోసం వెతుకుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
అంబాహ్ లోని బద్ ఫ్రా నివాసి అయిన పూజారామ్ జాతవ్ తన కుమారుడైన రాజా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అంబాలోని ప్రభుత్వాసుపత్రిలో రాజాను చేర్పించాడు. పరిస్థితి విషమించడంతో రాజాను వైద్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పూజారాం తన 8ఏళ్ల కుమారుడు గుల్షన్ తో కలిసి జిల్లా ఆసుపత్రికి వెళ్లాడు. చికిత్స పొందుతూ రాజా మరణించాడు. రాజా రక్తహీనతతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే తన కుమారుడి శవాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు పూజారామ్ అంబులెన్స్ కోసం అడగగా 15వందల రూపాయలు అవుతాయని చెప్పారు. అంత డబ్బు తన వద్ద లేదని ప్రభుత్వ అంబులెన్స్ కోసం ఆసుపత్రి సిబ్బందికి వద్దకు వెళ్లాడు. ఆసుపత్రిలో అంబులెన్స్ లేదని ప్రైవేట్ కారు అద్దెకు తీసుకోండని సలహా ఇచ్చారు.
దిక్కుతోచని, నిస్సహాయ స్థితిలో పూజారామ్ కు ఏం చేయాలో అర్థంకాలేదు..తన పెద్ద కుమారుడైన గుల్షన్ ఒడిలో రాజా శవాన్ని పడుకోబెట్టి…తక్కువ ధరకు వచ్చే అంబులెన్స్ కోసం వెళ్లాడు. గుల్షన్ నెహ్రుపార్క్ ఎదురుగా ఉన్న డ్రైన్ దగ్గర తన తమ్ముడి శంతో కూర్చున్నాడు. గుల్షాన్ తన సోదరుడి శవంతో ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న కొత్వాలి టిఐ యోగేంద్ర సింగ్ జాదౌన్ గుల్షాన్..తన సోదరుడి శవాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పూజారామ్ ఆసుపత్రికి చేరుకున్నాడు. తనకు నలుగురు పిల్లలు ఉన్నారని..అందులో రాజా చిన్నవాడని విలపించాడు. పోలీసుల సాయంతో పూజారామ్ తన కుమారుడి శవాన్ని అంబులెన్స్ లో తన సొంత గ్రామానికి తీసుకెళ్లాడు.
In Morena this child sitting on the roadsidewith the body of a 2yearold brother in his lap is an 8year old innocent GulshanDuring this his father Pujram kept wandering for the vehicle This incident of mp is a stigma not only for the government but also for our society and India pic.twitter.com/d9v7Q1qbNR
— Pooja Shrotriya ਪੂਜਾ ਸ਼੍ਰੋਤ੍ਰਿਯ पूजा श्रोत्रिय (@poojashrotriya1) July 10, 2022
గత ఐదు నెలల్లో రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. జరిగిన ఘటనపై ఈ ఘటనపై పీసీసీ అధ్యక్షుడు మాజీ సీఎం కమల్ నాథ్ విచారం వ్యక్తం చేశారు. శివరాజ్ సర్కార్ ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. అంబులెన్స్ లు అందుబాటులో లేక గర్భిణీలు కూడా ప్రాణాలు కోల్పోవల్సి వస్తుంది. వైద్యం అందక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మీ నిర్లక్ష్యానికి ఏడుకోట్ల మంది రాష్ట్ర ప్రజలు బలికావద్దని అభ్యర్థిస్తున్నానని ట్వీట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి