Viral Video: ప్రమాదకరమైన సింహాలతో వెళ్తున్న మహిళ.. ఆమె ధైర్యానికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్‌

Viral Video: సింహం అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువుగా పరిగణించబడుతుంది. దాని బలం, ధైర్యం అంతా ఇంతా కాదు. ఎంతో చురుకుదనంలా ఉండే సింహం..

Viral Video: ప్రమాదకరమైన సింహాలతో వెళ్తున్న మహిళ.. ఆమె ధైర్యానికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్‌
Follow us
Subhash Goud

|

Updated on: Jul 11, 2022 | 9:53 AM

Viral Video: సింహం అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువుగా పరిగణించబడుతుంది. దాని బలం, ధైర్యం అంతా ఇంతా కాదు. ఎంతో చురుకుదనంలా ఉండే సింహం.. అడవి రాజు అనే బిరుదు ఇచ్చారు. అయితే సింహాన్ని దూరం నుంచి చూస్తేనే భయంతో వణికిపోతాం. అక్కడినుంచి వెనక్కి తిరిగి చూడకుండా తెగ పరుగులు పెడుతుంటాం. అలాంటి ఓ మహిళ ఏకంగా సింహాలను తోలుకుంటూ వెళ్తోంది. ఆ దృశ్యం చూడ్డానికి కాళిమాత వన విహారం చేస్తోందా అనిపిస్తోంది. ఆ సింహాలు కూడా ఆమె చెప్పినట్లే నడుస్తున్నాయి.

అలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీడియోలో ఒక మహిళ కర్ర పట్టుకుని రెండు ప్రమాదకరమైన సింహాలను తోలుకుంటూ వెళ్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రెండు సింహాలను అడవిలో తీసుకెళ్తున్న దృశ్యం ఈ వీడియోలో చూడవచ్చు. దారిలో రెండు సింహాలు కనిపిస్తున్నాయి. వాటి వెనుకల ఒక మహిళ చేతిలో కర్రతో సింహాలను తోలుకుంటూ వెళ్తోంది. అవి సింహాలు కాదు.. గొర్రెలు అన్న రీతిలో వాటిని అదుపు చేస్తోంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి