Viral Video: ఇలాంటి ‘కాంట్రాక్ట్ మ్యారేజ్’ ఎప్పుడైనా చూసారా? పెళ్లి కూతురు షరతులు చూస్తే నవ్వకుండా ఉండలేరుగా..
ఈ కాంట్రాక్ట్ పేపర్‌లో వ్రాసిన షరతులు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఇందులో మొదటి షరతు నెలలో వధూవరులు ఒక పిజ్జా మాత్రమే తినాలి. రెండవ షరతు వరుడికి.. ఇందులో తాను వండిన ఆహారం ఎలా ఉన్నా 'అవును' బాగుంది
Viral Video: వివాహ వేడుక ప్రతి వధూవరుల జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు. పెళ్లి రోజుని గుర్తుండిపోయేలా చేసుకోవడానికి కొన్ని జంటలు ప్రత్యేక శ్రద్ధ తీసుకంటారు. కొందరు అలంకరణపై, మరికొందరు ఆహారంపై, మరికొందరు వివాహ వేడుకక్కి వచ్చే సమయంలో ఊరేగింపు ఇలా రకరకాలుగా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇది కాకుండా కొంతమంది జంటలు తమ అలంకరణపై కూడా చాలా శ్రద్ధ చూపుతారు. ఇది ప్రతి పెళ్లి వేడుకలలో సర్వ సాధారణం. అయితే కొన్ని వివాహాలు చాలా ప్రత్యేకమైనవిగా నిలుస్తాయి. అంతేకాదు.. దీని కారణంగా అవి వార్తల్లో నిలుస్తాయి. పెళ్లిలో వధూవరులు అగ్ని సాక్షిగా చేసే వాగ్దానాల గురించి మీరు తప్పక వినివుంటారు. చూసి ఉంటారు, కానీ పెళ్లి తర్వాత వధూవరులు కాంట్రాక్ట్ పేపర్‌పై వధువు సంతకం చేయడం ఎప్పుడైనా చూశారా? ఈ కాంట్రాక్టు పేపర్ పై పెళ్లికూతురు ‘విచిత్రమైన ‘ షరతులను రాసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
వాస్తవానికి.. వధూవరులు సంతకాలు చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నూతన దంపతులు జయమాల తర్వాత వివాహ ఒప్పంద పత్రాలపై వధూవరులు సంతకం చేయడాన్ని చూడవచ్చు. వెడ్‌లాక్ ఫోటోగ్రఫీ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. వీడియోలో మీరు పెద్ద కాంట్రాక్ట్ పేపర్‌ను చూడవచ్చు, దానిపై కొన్ని షరతులు రాసి, వధూవరులు సంతకం చేయడాన్ని చూడవచ్చు. విశేషమేమిటంటే, ఈ కాంట్రాక్ట్ పేపర్‌పై సాక్షుల సంతకాలు కూడా తీసుకున్నారు. తద్వారా వరుడు ఆ షరతులను అంగీకరించాడు.
ఈ కాంట్రాక్ట్ పేపర్‌లో వ్రాసిన షరతులు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఇందులో మొదటి షరతు నెలలో వధూవరులు ఒక పిజ్జా మాత్రమే తినాలి. రెండవ షరతు వరుడికి.. ఇందులో తాను వండిన ఆహారం ఎలా ఉన్నా ‘అవును’ బాగుంది అని ఎప్పుడూ చెప్పవలసి ఉంటుంది. మూడో షరతు వధువుకు, అందులో ఇంట్లో చీర కట్టుకోవాలని రాసి ఉంది. నాల్గవ షరతు ఏమిటంటే.. వరుడు అర్థరాత్రి వరకు పార్టీకి వెళ్ళడానికి అనుమతించింది.. అయితే అతడు తప్పనిసరిగా వధువుతో మాత్రమే ఆ పార్టీకి వెళ్ళాలి. అంతే కాకుండా రోజూ జిమ్‌కి వెళ్లాలని ఐదో షరతులో రాసి ఉండగా.. ఆరో షరతు ప్రకారం భర్త ఆదివారం అల్పాహారం తయారు చేయాల్సి ఉంటుంది.
View this post on Instagram
అదే సమయంలో, ఏడవ షరతు ఏమిటంటే, ప్రతి పార్టీలో భార్య అందమైన ఫోటోలు తీయాలి. చివరి షరతు ప్రకారం ఎనిమిదవ షరతు ప్రకారం, భర్త ఆమెను ప్రతి 15 రోజులకు షాపింగ్‌కు తీసుకెళ్లాలి. ఈ ప్రత్యేకమైన నిబంధనలను తెలుసుకున్న తర్వాత.. నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు. ఇది మ్యారేజ్ కాదు డీల్ అని ఓ యూజర్ రాస్తుండగా.. ఇది జాబ్ డీల్ లా పెళ్లి జరుగుతోందని అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..