Rare Friendship: జింక పిల్ల, తోటమాలి మధ్య స్నేహం.. మేకనే తల్లిగా భావించి పాలు తాగి పెరుగుతున్న అరుదైన ఘటన.

ఖుషీరామ్ తన మేకలను మేపడానికి సమీప అడవుల్లో వదిలాడు. సాయంత్రం మేకల మందతో పాటు ఒక చిన్న జింక పిల్ల ఇంటికి తిరిగి వచ్చింది. జింక శరీరం నుండి రక్తం కారుతోంది.

Rare Friendship: జింక పిల్ల, తోటమాలి మధ్య స్నేహం.. మేకనే తల్లిగా భావించి పాలు తాగి పెరుగుతున్న అరుదైన ఘటన.
Rare Deer Friendship
Follow us
Surya Kala

|

Updated on: Jul 09, 2022 | 3:41 PM

Rare Friendship: స్నేహం ఎవరికీ ఎప్పుడు ఎలా ఎవరి మధ్య ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు..ఒకొక్కసారి విచిత్రమైన మైత్రి అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కూడా.. తాజాగా యూపీలోని హమీర్‌పూర్ జిల్లాలో అటవీ శాఖ తోటమాలికి, జింక పిల్లకి మధ్య స్నేహం చర్చనీయాంశంగా మారింది. ఒకటిన్నర నెలల అరుదైన జాతి (Rare Deer) జింక తోటమాలి మేకలతో పాటు అతని ఇంటికి చేరుకుంది. అప్పటి నుంచి ఆ జింక పిల్లను తోటమాలి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అడవి జంతువుల నుండి కాపాడుతూ తగిన పోషణ అందిస్తున్నాడు. ఈ  బక్క జింక పిల్ల మేకల పాలు తాగుతుంది. మేకలు కూడా ఈ జింక పిల్లలను తన బిడ్డగా భావించి చేరదీశాయి. ఈ జింకను చూడడానికి  ప్రజలలో ఉత్సుకత నెలకొంది. ప్రస్తుతం ఈ జింక అటవీ శాఖ అధికారులకు ఓ పజిల్‌గా మిగిలిపోయింది!

హమీర్‌పూర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీ ఫారెస్ట్ అనే స్థలాన్ని అటవీ శాఖ నిర్మించింది. దీనిని 1996లో నిర్మించారు. ఈ ఉద్యానవనం పర్యావరణం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేయబడింది. దీని సంరక్షణకు గాను ఖుషీరామ్ అనే వాచ్‌మెన్/గార్డెనర్ తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం.. ఖుషీరామ్ తన మేకలను మేపడానికి సమీప అడవుల్లో వదిలాడు. సాయంత్రం మేకల మందతో పాటు ఒక చిన్న జింక పిల్ల ఇంటికి తిరిగి వచ్చింది. జింక శరీరం నుండి రక్తం కారుతోంది. ఖుషీరామ్ దానిని చూసి చలించిపోయాడు..  వైద్యం చేయించాడు. ప్రస్తుతం ఈ జింక పిల్ల మేకల మంద మధ్య ఉంటూ మేకల పాలు తాగి పెరుగుతోంది. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు జింకను చూడడానికి వక్కరు. జింకను పెంచే బాధ్యత తీసుకున్న అధికారులు పార్క్ తోటమాలికి అప్పగించారు.

తల్లి మేకలను జింక పిల్లగా భావిస్తుంది, వాటి పాలు తాగిన తర్వాత బతికి ఉంది జిల్లాలోని సిటీ ఫారెస్ట్ పార్క్ నుండి కొంత దూరంలో యమునా, బెత్వా నదుల సమీపంలో ఉంది. అటవీ ప్రాంతం కావడంతో, పచ్చదనంతో నిండి ఉంటుంది. దీంతో ఇప్పుడు జింకల మందలు ఇక్కడకు రావడం ప్రారంభించాయి.  బహుశా ఈ చిన్న జింక పిల్ల మంద నుండి వేరు చేయబడి..  మేకల మందలో చేరి ఉంటుంది. మేకలు తమ ఇంటికి చేరుకున్నప్పుడు.. ఆ జింక పిల్ల కూడా వాటితో పాటు పార్కుకు చేరుకుంది. ఇప్పుడు జింక పిల్ల మేకల మధ్య నివసిస్తుంది. వాటి పాలు తాగుతుంది. ఖుషీరామ్ పిలుపుతో కొన్ని సెకన్లలో అతనిని వద్దకు చేరుకుంటుంది!

ఇవి కూడా చదవండి

పార్క్‌లోని తోటమాలి ఖుషీరామ్‌, జింక పిల్ల మధ్య ఉన్న స్నేహం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఖుషీరామ్ స్వరం వింటే చాలు ఆ జింక పిల్ల ఎక్కడ ఉన్నా వెంటనే అతని వద్దకు చేరుకుంటుంది. అతనితో ఆడుకుంటుంది. జింక ను ముద్దు చేస్తూ.. ఖుషిరామ్ ఆడుకుంటాడు.   ఖుషీరామ్, జింకల ప్రేమను చూడటానికి ప్రజలు ఇక్కడకు చేరుకుంటున్నారు.

అరుదైన జాతి జింక లభించడంతో అటవీ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలో జింకల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.. ఈ నెలన్నర బక్‌హెడ్ చితాల్ జాతికి చెందిన ఆడ జింకపిల్ల. జిల్లా డిప్యూటీ రేంజర్ సుజిత్ సింగ్ ఈ జింక ఇప్పటికీ చాలా చిన్నదని.. దీని బాధ్యత తోటమాలి ఖుషీ రామ్‌కి బాధ్యత అప్పగించబడిందని తెలిపారు. చిన్న పిల్ల కనుక దీనిని మరెక్కడా వదిలిపెట్టలేమని.. ప్రాణానికి ప్రమాదమని అధికారులు చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే