AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Employees Bali Tour: తమ ఉద్యోగులను సొంత ఖర్చులతో బాలికి పంపిన కంపెనీ.. మీ సంస్థలో ఉద్యోగం ఉందా అంటున్న నెటిజన్లు

తన ఉద్యోగులను బాలికి 2 వారాల పర్యటనకు పంపి.. తమ ఉద్యోగులకు మరుపురాని బహుమతిని ఇచ్చింది . మొదట ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు కంగుతిన్నారు. అలాగే ఇతర ఉద్యోగులు కూడా ఆ కంపెనీని 'బెస్ట్ కంపెనీ' అని, కంపెనీ యజమానురాలు 'ప్రపంచంలో బెస్ట్ బాస్' అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Employees Bali Tour: తమ ఉద్యోగులను సొంత ఖర్చులతో బాలికి పంపిన కంపెనీ.. మీ సంస్థలో ఉద్యోగం ఉందా అంటున్న నెటిజన్లు
Trip To Bali
Surya Kala
|

Updated on: Jul 08, 2022 | 3:24 PM

Share

Employees Trip To Bali: మంచి జీతంతో పాటు అత్యుత్తమ సౌకర్యాలు పొందే కంపెనీలో ఉద్యోగం చేయాలనేది ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రగాఢ కోరిక. అయితే ఉద్యోగులకు సంబంధించిన అన్ని విషయాలను చూసుకునే కంపెనీలు చాలా తక్కువ. ఎక్కడో ఒక కంపెనీలో, మంచి జీతం, ఆపై సౌకర్యాల కల్పనను చేసుకుంటాయి. అయితే బహు అరుదుగా తన కంపెనీ ఉద్యోగులను ఎక్కడికైనా టూర్‌కు తీసుకెళితే, అది గొప్ప విషయమే అవుతుంది. అలాంటి కంపెనీలో పనిచేయడానికి ఎవరు ఇష్టపడరు? అటువంటి ఆస్ట్రేలియన్ కంపెనీ(Australian Company) ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. తన ఉద్యోగులను బాలికి 2 వారాల పర్యటనకు పంపి.. తమ ఉద్యోగులకు మరుపురాని బహుమతిని ఇచ్చింది . మొదట ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు కంగుతిన్నారు. అలాగే ఇతర ఉద్యోగులు కూడా ఆ కంపెనీని ‘బెస్ట్ కంపెనీ’ అని, కంపెనీ యజమానురాలు ‘ప్రపంచంలో బెస్ట్ బాస్’ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వాస్తవానికి, ఆస్ట్రేలియాలోని మార్కెటింగ్ కంపెనీ సూప్ ఏజెన్సీ తన ఉద్యోగులను 2 వారాల పాటు బాలికి విహారయాత్రకు పంపింది. అందుకు అయ్యే ఖర్చులన్నింటినీ కంపెనీనే భరించింది. తినడం తాగడం నుండి ప్రయాణ ఖర్చులు,  వసతి సౌకర్యాలు మొదలైనవన్నీ కంపెనీనే భరించింది. బాలి అనేది ఇండోనేషియాలోని ఒక ద్వీపం. ఇది అద్భుతమైన అందంతో  ప్రపంచ  ప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా ఖ్యాతిగాంచింది.  అటువంటి బాలికి సందర్శనకు వెళ్లాలని అనేక మంది కలలు కంటూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో..  కంపెనీ వైపు నుండి ఈ కలను సాకారం చేసుకునే అవకాశం ఉంటే.. అలాంటి కంపెనీని కలలో కూడా ఎవరైనా చెడుగా ఎలా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగుల పర్యటనలు,అద్భుతమైన సెలవుల వీడియోను షేర్ చేసింది. చాలామంది ఉద్యోగులు పూల్‌లో సరదాగా గడపడం, హైకింగ్ చేయడం , తినడం , త్రాగడం వంటివి చూడవచ్చు. అవసరమైతే ఉద్యోగులు కూడా అక్కడి నుంచి మీటింగ్స్ లో పాల్గొన్నారు.  కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కాట్యా వకులెంకో ప్రకారం.. ఇది ఉద్యోగులకు గొప్ప అనుభవం, అత్యుత్తమ టీమ్ బిల్డింగ్ కూడా అని చెప్పారు.

View this post on Instagram

A post shared by Soup Agency (@soup_agency)

డైలీ మెయిల్ ప్రకారం..  కరోనా మహమ్మారి సమయంలో, ఎక్కడి నుండైనా పని చేయవచ్చని కంపెనీ భావించింది. కాబట్టి ఈ సంస్కృతిని ప్రోత్సహించడానికి ఈ యాత్ర నిర్వహించబడింది. ఇప్పుడు కంపెనీ యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తోందని విశ్వసనీయ సమాచారం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..