Shinzo Abe shot: జపాన్‌ మాజీ ప్రదాని షింజో అబే మృతి.. నిర్దారించిన ఆసుపత్రి వర్గాలు..

షింజో అబే మృతి చెందారు. నరా నగరంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఆయనపై కాల్పులు జరిపారు. షింజో అబేపై కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాల్పుల్లో గాయపడ్డ షింజోను వెంటనే హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు.

Shinzo Abe shot: జపాన్‌ మాజీ ప్రదాని షింజో అబే మృతి.. నిర్దారించిన ఆసుపత్రి వర్గాలు..
Shinzo Abe Shot
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 08, 2022 | 3:06 PM

దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జపాన్‌ మాజీ ప్రదాని షింజో అబే మృతి చెందారు. నరా నగరంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఆయనపై కాల్పులు జరిపారు. షింజో అబేపై కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాల్పుల్లో గాయపడ్డ షింజోను వెంటనే హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే షింజో శరీరంలో కదలికలు లేవని డాక్టర్లు గుర్తించారు. కార్డియో పల్మనరీ అరెస్టుతో పరిస్థితుల్లో ఉన్నారని డాక్టర్లు చెప్పారు. నరాకి చెందిన 41 ఏళ్ల యమగామి ఎట్సుయా మాజీ ప్రధానిపై కాల్పులు జరిపినట్లు గుర్తించారు. కాల్పుల తర్వాత పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కాల్పుల జరిగిన ప్లేస్‌ నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

కాల్పులు జరిపిన యమగామి గతంలో జపాన్‌ సైన్యంలో పనిచేసినట్లు తెలుస్తోంది. మారీటైమ్‌ సెల్ప్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ మాజీ ఉద్యోగిగా గుర్తించారు. మాజీ ప్రధానిపై ఎందుకు కాల్పులు జరిపారు? ఆదివారం ఎన్నికలు జరగబోయే టైమ్‌లో ఈ కాల్పులు జరగడం వెనుక ఏదైనా కుట్ర ఉందా? ఇతర రాజకీయ కారణాలు ఉన్నాయా? అనేది ఇంకా తేలలేదు.

అంతర్జాతీయ వార్తల కోసం..