Alcohol: ఆల్కహాల్ అలవాటు.. ఆడాళ్లకు ఒకలా, మగాళ్లకు మరోలా మద్యం ప్రభావం.. షాకింగ్ డీటేల్స్
కొందరు మద్యానికి బానిసలైతే మరికొందరు ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా మద్యం సేవిస్తున్నారు. అయితే, ఆల్కహాల్ తాగిన వెంటనే అది మెదడుపై ప్రభావం చూపుతుంది.
Alcohol: ఆల్కహాల్ పెద్ద సంఖ్యలో ప్రజలు వినియోగించే డ్రింక్ ఇదేనని చెప్పొచ్చు..అత్యంత ప్రభావవంతమైన మందులలో ఒకటి. కొందరు మద్యానికి బానిసలైతే మరికొందరు ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా మద్యం సేవిస్తున్నారు. అయితే, ఆల్కహాల్ తాగిన వెంటనే అది మెదడుపై ప్రభావం చూపుతుంది. పురుషులు,మహిళల మెదడులపై ఆల్కహాల్ వేర్వేరు ప్రభావాలను చూపుతుందని కొత్త అధ్యయనం చెబుతోంది. ఎలుకలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో, మగ మరియు ఆడవారి మెదడుపై ఆల్కహాల్ వేర్వేరు ప్రభావాలను చూపుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఎలుకలు,మానవుల మెదడు ఒకే విధమైన నిర్మాణం, పనితీరు కలిగి ఉంటుంది. ఆ కారణంగా మద్యపానం పురుషులు, స్త్రీలపై వేర్వేరు ప్రభావాలను చూపుతుందని దీని ఆధారంగా నిర్ధారించబడింది. సాధారణంగా చాలామంది మానసిక ఉల్లాసం కోసం మద్యం సేవిస్తుంటారు. ఇప్పటికే ఆల్కహాల్.. మెదడుపై ఎలా ప్రభావం చూపిస్తుందో అనేక అధ్యయనాలు జరిగాయి. అయితే కొత్త అధ్యయనంలో మరో ఒక ప్రత్యేకమైన విషయం తెరపైకి వచ్చింది. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో మద్యం మగవారు, ఆడవారి మెదడుపై వేర్వేరు ప్రభావాలను చూపుతుందని తెలుస్తోంది. అకడమిక్ జర్నల్ eNeuro లో సమీక్ష కోసం ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం..
మద్యం పురుషులు- స్త్రీల మెదడును వేర్వేరుగా ప్రభావితం చేస్తుందని పేర్కొంది. ఆల్కహాల్ ప్రభావం వల్ల ఎలుకల మెదడులోని అమిగ్డాలా చర్యలో మార్పులను శాస్త్రవేత్తలు గమనించారని, అయితే ఈ మార్పు ప్రభావం మగ- ఆడ ఎలుకలలో భిన్నంగా కనిపించిందని పరిశోధనలో తేలింది.
ఆల్కహాల్ వాడకం, దాని వల్ల ఉత్పన్నమయ్యే డిప్రెషన్, చంచలత వంటివి అకాడెమిక్ జర్నల్ eNeuro లో ప్రచురించబడిన నివేదికలో వివరించారు. ఇది ముఖ్యంగా ఆల్కహాల్ యూజ్ డిజార్డర్‌తో బాధపడేవారికి. ముఖ్యంగా అమెరికాలో ఆల్కహాల్ తీసుకునే వారిలో 85 శాతం మందిలో, ఇది కేవలం 5 శాతం పెద్దలలో మాత్రమే జరుగుతుంది. పరిశోధకులు ఎలుకలలో ఈ ప్రయోగాన్ని పదేపదే నిర్వహించారు. ఈ సమయంలో మగవారి స్థితిలో తీవ్రమైన భయాందోళన గమనించినట్టు పరిశోధుకులు తెలిపారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి