AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓరి నాయనో ఇంత అత్యాశనా.. ఈ చింపాంజి చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..!

Viral Video: మనిషిలో అత్యాశ అనేది సహజంగానే ఉంటుంది. ఏదైనా ఫ్రీగా వస్తుందంటే చాలు.. ఎగబడి ఎత్తుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు.

Viral Video: ఓరి నాయనో ఇంత అత్యాశనా.. ఈ చింపాంజి చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..!
Chimpanzee
Shiva Prajapati
|

Updated on: Jul 08, 2022 | 4:45 PM

Share

Viral Video: మనిషిలో అత్యాశ అనేది సహజంగానే ఉంటుంది. ఏదైనా ఫ్రీగా వస్తుందంటే చాలు.. ఎగబడి ఎత్తుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూశాం. అయితే, జంతువుల్లోనూ అత్యశ ఉంటుందని నిరూపించింది ఓ చింపాంజి. అవును, మిగతా చింపాంజీలు ఎక్కడ తీసుకెళ్తాయో అని భయంతో.. నెక్ట్స్ లెవల్‌‌లో తన కక్కుర్తిని ప్రదర్శించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

సాధారణంగానే జంతువులకు సంబంధించి వేలాది వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే.. అవి చేసే అల్లరి చేష్టలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా.. వణ్యప్రాణుల జీవన విధానం మనుషులకు ఒక విధమైన మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అందుకే.. జంతువులకు సంబంధించిన వీడియోలను చూడటానికి ఇష్టపడుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ చింపాంజికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చింపాంజి.. తన అత్యాశను ఓ రేంజ్‌లో ప్రదర్శించింది. ఎవరో వ్యక్తి వన్యప్రాణులకు పండ్లను ఆహారంగా వేశాడు. అయితే, కొన్ని చింపాంజీలు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ పండ్లను తీసుకెళ్లాయి. అయితే, ఓ చింపాంజీ మాత్రం పోతె దొరకవన్నట్లు చేసింది. ఎంత వీలుంటే అంత మేరకు.. అందినకాడికి పండ్లను తీసుకెళ్లింది. రెండు చేతల్లో కొన్ని పండ్లు, నోటితో, కాలి వేళ్ల మధ్యలో కూడా పెట్టుకుని పండ్లను తీసుకెళ్లింది. నడవటానికి ఇబ్బంది పడుతున్నా సరే.. తగ్గేదే లే అన్నట్లుగా పండ్లను ఎత్తుకెళ్లింది చింపాంజి. అయితే, చింపాంజి పండ్లను తీసుకెళ్తుండగా.. ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ కక్కుర్తి చింపాంజీని మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట