Rajasthan:వరద ఉద్ధృతిలో బైక్‌తోపాటు కొట్టుకుపోయిన వ్యక్తి.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

వర్షం పడిన తర్వాత రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచింది. ఈ సమయంలో ఆ వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. ఒక్కసారిగా ఆ వ్యక్తి నీటి ప్రవాహంలో బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. కళ్లముందే అతడు..

Rajasthan:వరద ఉద్ధృతిలో బైక్‌తోపాటు కొట్టుకుపోయిన వ్యక్తి.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
Raine
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 08, 2022 | 1:01 PM

రుతుపవనాలు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించాయి.. భారీ వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో వరదల ముంచెత్తుతున్నాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జైసల్మేర్‌లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా రోడ్లపై నీరు నదుల్లా ప్రవహిస్తోంది. అక్కడి వరదలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అందులో ఒక యువకుడు ఒక బైక్‌తో పాటు వరద కాలువలో కొట్టుకుపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో గురువారం సాయంత్రం షేర్‌ చేయబడింది.. ఈ సంఘటన జైసల్మేర్‌లోని భైరవ్-చందన్ రోడ్డులో జరిగింది. వర్షం పడిన తర్వాత రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచింది. ఈ సమయంలో ఆ వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. ఒక్కసారిగా ఆ వ్యక్తి నీటి ప్రవాహంలో బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్థానిక వ్యక్తులు కొందరు అతన్ని రక్షించారు. అతని బైక్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.

రానున్న 24 గంటల్లో రాజస్థాన్‌లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.. తూర్పు రాజస్థాన్‌లోని అల్వార్, అజ్మీర్, భిల్వారా, బుండి, జైపూర్, కరౌలి, సవాయ్ మాధోపూర్, టోంక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు పశ్చిమ రాజస్థాన్‌లోని బికనీర్, హనుమాన్‌గఢ్, శ్రీ గంగానగర్‌లకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అదే సమయంలో బరన్, కోట, ఝలావర్, జుంజును, చురు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ ప్రకారం రానున్న ఐదు రోజుల్లో యూపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ,సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి