Viral Video: ప్రతీ నీటి బొట్టు విలువైనదే.. గొప్ప సందేశం ఇస్తున్న శునకం.. వీడియో తప్పక చూడండి..

కొన్ని జంతువుల వీడియోలు చూడటానికి ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు మంచి సందేశాన్ని ఇస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: ప్రతీ నీటి బొట్టు విలువైనదే.. గొప్ప సందేశం ఇస్తున్న శునకం.. వీడియో తప్పక చూడండి..
Dog Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 08, 2022 | 1:43 PM

Dog Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. అయితే.. కొన్ని జంతువుల వీడియోలు చూడటానికి ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు మంచి సందేశాన్ని ఇస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక కుక్క కుళాయి నీరు తాగడానికి ప్రయత్నిస్తుంది. స్వయంగా ట్యాప్ తిప్పిన శునకం.. కుళాయి ఆ తర్వాత నీటిని తాగుతుంది. ఈ వీడియోలో కుక్క ఇచ్చిన సందేశం నెటిజన్ల మనసును హత్తుకుంటోంది. అందుకే జంతువులను చూసి చాలా నేర్చుకోవచ్చంటూ పేర్కొంటున్నారు.

వైరల్ వీడియోలో ఓ శునకం పిల్లతో కలిసి వాటర్ ట్యాప్ దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత పిల్ల పక్కకు వెళ్లిపోతుంది. శునకం వచ్చి రాగానే స్వయంగా వాటర్ ట్యాప్ తిప్పి నీటిని తాగుతుంది. మళ్లీ బంద్ చేసి.. కాస్త గాలి పీల్చుకొని మళ్లీ ఓపెన్ చేసి నీరు తాగుతుంది. ఆ తర్వాత బంద్ చేస్తోంది. ఇలా శునకం నీటిని ఎంత పొదుపుగా ఉపయోగిస్తే.. అంత మంచిదంటూ అందరికీ సందేశం ఇచ్చింది. దీంతోపాటు శునకం తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

ఈ వీడియోను ఐపిఎస్ అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో పంచుకున్నారు. “ప్రతి నీటి చుక్క విలువైనదే.. ఈ విషయం కుక్కకి కూడా అర్థమైంది.. మనుషులకు ఎప్పుడు అర్థం అవుతుంది..? అంటూ రాశారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ తెలివైన కుక్కను చూసి ముగ్ధులమయ్యాంటూ పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ ఈ శునకం నుంచి నేర్చుకోవాలని.. నీటిని ఎలా సంరక్షించాలో తెలుసుకోవాలంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే