Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Student Scholarship: ప్రతిభకు పేదరికం అడ్డం కాదు..యుఎస్ లో డిగ్రీ చదువుకోసం రూ.2.5 కోట్ల స్కాలర్‌షిప్ పొందిన స్టూడెంట్.. ఎక్కడంటే

టాలెంటెడ్ స్టూడెంట్‌కి సంబంధించిన ఓ కథ వెలుగులోకి వచ్చింది. బీహార్‌లోని గోన్‌పురా అనే చిన్న గ్రామానికి చెందిన రోజువారీ కూలీ కొడుకు ప్రేమ్ కుమార్.. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన లఫాయెట్ కాలేజీ నుండి 2.5 కోట్ల స్కాలర్‌షిప్ పొందాడు.

Student Scholarship: ప్రతిభకు పేదరికం అడ్డం కాదు..యుఎస్ లో డిగ్రీ చదువుకోసం రూ.2.5 కోట్ల స్కాలర్‌షిప్ పొందిన స్టూడెంట్.. ఎక్కడంటే
Patna Dalit Student Scholar
Follow us
Surya Kala

|

Updated on: Jul 08, 2022 | 12:01 PM

Student Scholarship: విదేశాల్లో చదువుకోవడం చాలా మంది భారతీయ విద్యార్థుల కల. విదేశాల్లో చదువుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది. తమ పిల్లలకు చదువుకునే ఆసక్తి, తెలివి తేటలు ఉన్నా.. విదేశాలకు చదువు నిమిత్తం పంపించడం ప్రతి తల్లిదండ్రులకు సాధ్యం కాదు. అయితే కొంతమంది విద్యార్థులు తమ ప్రతిభతో దేశం ఖ్యాతిని ఖండాతరాల్లో వ్యాపింపజేస్తున్నారు. అలాంటి టాలెంటెడ్ స్టూడెంట్‌కి సంబంధించిన ఓ కథ వెలుగులోకి వచ్చింది. బీహార్‌లోని గోన్‌పురా అనే చిన్న గ్రామానికి చెందిన రోజువారీ కూలీ కొడుకు ప్రేమ్ కుమార్.. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన లఫాయెట్ కాలేజీ నుండి 2.5 కోట్ల స్కాలర్‌షిప్ పొందాడు. గ్రాడ్యుయేషన్ డిగ్రీని అభ్యసించేందుకు ప్రేమ్ కుమార్‌కు రూ.2.5 కోట్ల స్కాలర్‌షిప్ ఇచ్చారు. ఈ ఘనత సాధించిన భారత తొలి దళిత విద్యార్థి ప్రేమ్. లాఫాయెట్ కాలేజ్ అమెరికాలోని టాప్ 25 కాలేజీలలో ఒకటి ( America College Scholarship ) .

తన కుటుంబంలో కాలేజీకి వెళ్లిన మొదటి వ్యక్తి ప్రేమ్. ప్రస్తుతం శోషిత్ సమాధాన కేంద్రంలో 12వ తరగతి చదువుతున్నాడు. యూఎస్‌లో ప్రేమ్ మెకానికల్ ఇంజినీరింగ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌పై నాలుగేళ్లపాటు చదువుకుంటాడు. ఈ స్కాలర్‌షిప్ లో  విద్య, చదువుకునే సమయంలో కావాల్సిన సదుపాయాలు, ప్రయాణించడానికి అయ్యే మొత్తం ఖర్చు, ట్యూషన్ ఫీజులు, ఆరోగ్య బీమా కవర్ చేయబడతాయి.

కేవలం 6 మంది విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ పొందారు ప్రపంచం నలుమూలల నుండి మొత్తం 6 మంది విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ పొందారు. ఈ స్కాలర్‌షిప్ పేరు డయ్యర్ ఫెలోషిప్. ఈ ఫెలోషిప్ కింద ప్రపంచంలోని కష్టతరమైన సమస్యలను పరిష్కరించడానికి అంతర్గత ప్రేరణ, నిబద్ధత ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి ఇస్తారు. ఇలా స్కాలర్‌షిప్ పొందిన 6వేల మంది స్టూడెంట్స్ లో ఒకరు బీహార్ కు చెందిన ప్రేమ్. ప్రేమ్ తెలివి తేటలను, ప్రతిభను జాతీయ సంస్థ డెక్స్టెరిటీ గ్లోబల్ గుర్తించింది. తమ సంస్థ అతనికి శిక్షణ ఇచ్చింది. డెక్స్టెరిటీ గ్లోబల్ అనేది దళిత పిల్లల కోసం పనిచేసే సంస్థ.

ఇవి కూడా చదవండి

ఈ స్కాలర్‌షిప్ ఎలా పొందాలంటే:  2013 సంవత్సరం నుంచి బీహార్‌లో మహాదళిత్ పిల్లల ఉన్నతి కోసం పని ప్రారంభించామని డెక్స్టెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకులు తెలిపారు. విద్యార్థుల ద్వారా ఈ సమాజంలోని రాబోయే తరానికి నాయకత్వాన్ని సృష్టించడం తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. తనకు స్కాలర్ షిప్ రావడంపై ప్రేమ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. నా తల్లిదండ్రులు ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు. నేను ఇప్పుడు అమెరికా వెళ్లి చదువుకునే అవకాశం లభించండి.. ఇది నాకు చాలా సంతోషకరమైన విషయమని చెప్పాడు ప్రేమ్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..