Weather Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. రాగాల ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో బుధవారం ఏర్పడిన వాయుగుండం గురువారం ఉత్తర ఒడిశాకు ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించింది. ఈ నేపథ్యంలో రాగల ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. 

Weather Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. రాగాల ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
Rains
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Jul 11, 2022 | 5:24 PM

Weather Alert: ఓ వైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి.. వీటికి ఆవర్తనాలు తోడవడంతో తెలుగు రాష్ట్రాల సహా అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, అమరావతిలోని భారత వాతావరణ శాఖ కేంద్రాలు రానున్న రెండు, మూడు రోజులపాటు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వేర్వేరు ప్రకటనల్లో ప్రకటించాయి.

ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఉత్తర ద్వీపకల్ప భారతదేశంలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుండి 5.8 కి.మీ ఎత్తులో తూర్పు-పశ్చిమ జోన్ 20 డిగ్రీల ఉత్తరంలో కేంద్రీకృతమై ఉంది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో బుధవారం ఏర్పడిన వాయుగుండం గురువారం ఉత్తర ఒడిశాకు ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించింది. ఈ నేపథ్యంలో రాగల ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో, రాయలసీమలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నెల 7, 8, 11 తేదీల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

తెలంగాణలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 9వ తేదీన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి