AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ట్రక్కును ఢీకొట్టిన ట్రైన్‌.. లైవ్‌ యాక్సిడెంట్‌ వీడియో వైరల్‌.. అసలేమైందంటే..

ఏదీఏమైనా రైల్వే క్రాసింగ్ వద్ద అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు అధికారులు. తాజాగా.. ఓ లారీ రైల్వే క్రాసింగ్ వద్ద నిలిచిపోయింది. ఈ క్రమంలో వచ్చి రైలు దాన్ని ఢీకొట్టింది.

Viral Video: ట్రక్కును ఢీకొట్టిన ట్రైన్‌.. లైవ్‌ యాక్సిడెంట్‌ వీడియో వైరల్‌.. అసలేమైందంటే..
Train Collided With A Truck
Shaik Madar Saheb
|

Updated on: Jul 07, 2022 | 3:46 PM

Share

Train Truck Accident Video Viral: రైల్వే క్రాసింగ్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు తరచూ వాహనదారులకు సూచిస్తుంటారు. కానీ కొన్నిసార్లు వాహనాదారులు నిర్లక్ష్యం కారణంగా.. మరికొన్నిసార్లు రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనాలు ఇరుక్కుని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఏదీఏమైనా రైల్వే క్రాసింగ్ వద్ద అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు అధికారులు. తాజాగా.. ఓ లారీ రైల్వే క్రాసింగ్ వద్ద నిలిచిపోయింది. ఈ క్రమంలో వచ్చి రైలు దాన్ని ఢీకొట్టింది.. ట్రక్కులో సాంకేతిక లోపం కారణంగా.. రైల్వే ట్రాక్‌ మధ్యలో ఇరుక్కుపోవడంతో గురువారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రైలు లారీని ఢీకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రాక్‌పై నిలిచిపోయిన ఓ ట్రక్కును ప్యాసింజర్‌ రైలు ఢీకొట్టిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బీదర్‌లోని భాల్కీ రైల్వే క్రాసింగ్‌ వద్ద ట్రాక్‌పై ఓ ట్రక్కు నిలిచిపోయింది. అయితే, ట్రక్కు సిద్ధేశ్వర్ రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలపైకి రాగానే ఇంజిన్ నిలిచిపోయి ట్రాక్ మధ్యలో ఇరుక్కుంది. లారీ ముందుకు కదలకపోవడంతో అక్కడున్న వారు పరుగున వచ్చి సాయం చేశారు. చాలా మంది కలిసి ట్రక్కును అక్కడినుంచి బయటకు లాగేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ట్రాక్‌పై వస్తున్న ప్యాసింజర్‌ రైలు.. ట్రక్కును ఢీకొట్టింది. రైలు దగ్గరగా రావడంతో అంతా అక్కడినుంచి పరుగులు తీశారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

కాగా, రైల్వే అధికారులు, స్థానికులు లోకోమోటివ్ పైలట్‌కు సకాలంలో సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..