Telugu News Trending Baraatis Dance Under Tarp As Groom Sits in Bus Amid Heavy Rains in Indore, Watch video
Viral Video: భారీ వర్షంలోనే పెళ్లి బరాత్.. తడవకుండా ఉండేందుకు వీరేం చేశారో మీరే చూడండి..
Viral Video: దేశమంతటా రుతుపవనాలు విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పెళ్లిళ్లు తదితర ఫంక్షన్లు నిర్వహించుకునేవారి తిప్పలు..
Viral Video: దేశమంతటా రుతుపవనాలు విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పెళ్లిళ్లు తదితర ఫంక్షన్లు నిర్వహించుకునేవారి తిప్పలు వర్ణనాతీతం. కొందరు భారీ వర్షాల ధాటికి శుభకార్యాలు వాయిదా వేసుకుంటుంటే మరికొందరు మంచి ముహూర్తం మించినా దొరకదంటూ వర్షంలోనే వేడుకలు కానిచ్చేస్తున్నారు. ఈక్రమంలో మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ పెళ్లిబృందం భారీ వర్షం పడుతుండగానే టార్పాలిన్ కవర్ కింద బరాత్ వేడుకను జరుపుకుంది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శైలేందర్ యాదు అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేసుకున్న ఈ వీడియోలో భారీ వర్షం కురుస్తున్నా వధువు ఇంటికి చేరుకునేందుకు టార్పాలిన్ షీట్‌లో బరాత్ నిర్వహించడం మనం చూడవచ్చు. అందులోనే పెళ్లిబృందం నృత్యాలు చేసింది. బరాత్ ముందు కదులుతున్న బస్సులో వరుడు, ఇతర పెళ్లికి వచ్చిన అతిథులు కూర్చున్నారు. ఈ బరాత్ పరదేశిపురలోని క్లర్క్ కాలనీ నుంచి మదన్ మహల్ వైపు సాగగా చూసినవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. నెటిజన్లు కూడా ఈ వీడియోను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ‘ఇలాంటి వేడుకలు ఇండియాలో మాత్రమే జరుగుతాయి, మంచి మూహూర్తం మళ్లీ దొరకదనుకున్నారేమో అందుకే ఇలా బరాత్ చేసుకున్నారు’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.