AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral news: వాట్ ఎన్ ఐడియా.. రిక్రూటర్లను ఆకట్టుకోవడానికి రెజ్యూమ్‌ ఎలా పంపాడో మీరే చూడండి..

ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగంలోకి చేరాలనుకునేవారు మొదట చేసే పని రెజ్యూమ్‌ ప్రిపేర్‌ చేసుకోవడం. తమ విద్యార్హతలు, నైపుణ్యాలను, భవిష్యత్‌లో సాధించాల్సిన లక్ష్యాలతో పాటు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలన్నింటినీ అందులో పొందుపరుస్తారు..

Viral news: వాట్ ఎన్ ఐడియా.. రిక్రూటర్లను ఆకట్టుకోవడానికి రెజ్యూమ్‌ ఎలా పంపాడో మీరే చూడండి..
Basha Shek
|

Updated on: Jul 06, 2022 | 1:39 PM

Share

ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగంలోకి చేరాలనుకునేవారు మొదట చేసే పని రెజ్యూమ్‌ ప్రిపేర్‌ చేసుకోవడం. తమ విద్యార్హతలు, నైపుణ్యాలను, భవిష్యత్‌లో సాధించాల్సిన లక్ష్యాలతో పాటు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలన్నింటినీ అందులో పొందుపరుస్తారు. ప్రస్తుతం సంస్థలన్నీ రెజ్యూమ్‌ ఆధారంగానే ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తున్నాయి కాబట్టి రిక్రూటర్లను ఆకట్టుకునేలా రెజ్యూమ్‌లు ప్రిపేర్‌ చేసుకుంటున్నారు. ఈక్రమంలో అంద‌రిలాగా సీవీ పంపితే త‌న‌ను ఎవ‌రు గుర్తిస్తారు? అనుకున్నాడేమో.. రెజ్యూమ్‌ను పంపించడంలో తన సృజనాత్మకతను చాటుకున్నాడు జైపూర్‌కి చెందిన మేనేజ్‌మెంట్ ట్రైనీ అయిన అమన్ ఖండేల్‌వాల్. జొమాటో బాయ్ గెట‌ప్‌లో వివిధ కంపెనీల‌కు పంపిన అతను పంపిన రెజ్యూమ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అంతేకాదు పెద్ద పెద్ద సంస్థలను సైతం ఆకట్టుకుంటోంది.

పుణేలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ నుంచి పట్టభద్రుడైన అమన్‌ ఉద్యోగం కోసం రెజ్యూమ్‌ను పంపించాడు. అయితే దీని కోసం కాస్త క్రియేటివిటీగా ఆలోచించాడు. జొమాటో బాయ్ అవ‌తార‌మెత్తి పేస్ట్రీ బాక్స్‌లో కేక్‌తోపాటు రెజ్యూమ్‌ను స్టార్టప్‌ కంపెనీల‌కు పంపించాడు. ‘ సాధారణంగా అన్ని రెజ్యూమ్‌లు చెత్తబుట్టల్లోకి వెళ్తాయి.. కానీ నా రెజ్యూమ్ మాత్రం మీ పొట్టలోకి వెళ్తుంది’ అంటూ తన రెజ్యూమ్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. దీంతో అమన్‌ రెజ్యూమ్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అతని ఐడియా నెటిజ‌న్లతోపాటు డ‌న్జో, జొమాటోను కూడా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా త‌మ‌కు ఢోక్లా స‌ప్లై చేయాల‌ని డ‌న్జో స‌ర‌దాగా కామెంట్ చేసింది. ‘హే అమన్, మీ ఆలోచన చాలా బాగుంది, ఎగ్జిక్యూషన్ అద్భుతంగా ఉంది’ జొమాటో ప్రశంసించింది. నెటిజన్లు కూడా ‘ఇదొక క్రేజీ రెజ్యూమ్‌’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి