Telugu News Trending Viral Video Dinosaur attack video dinosaur like animal shocking video went viral
Viral Video: రోడ్డుమీదకొచ్చిన డైనోసార్.. తిండిపెట్టబోతే మింగబోయింది.. వైరలవుతోన్న ఈ వీడియోలో అసలు విషయమేమిటంటే..
Viral Video: ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్‌అవుతున్నాయి. కుక్కలు, పిల్లులు, సింహాలు, ఏనుగులు, మొసళ్లు.. ఇలా ఎన్నో రకాల వన్యప్రాణుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా..
Viral Video: ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్‌అవుతున్నాయి. కుక్కలు, పిల్లులు, సింహాలు, ఏనుగులు, మొసళ్లు.. ఇలా ఎన్నో రకాల వన్యప్రాణుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ట్రెండింగ్ వీడియోల్లో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే మరికొన్ని ఫన్నీగా ఉండి నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఆ వీడియో కనుక మీరు చూస్తే మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో ఒక డైనోసార్ తన దగ్గరికి వచ్చిన వ్యక్తిని మింగడానికి ప్రయత్నిస్తుంటుంది. అదేంటి.. అప్పుడెప్పుడో అంతరించిపోయిన డైనోసార్ ఎలా మింగడానికి ఎలా ప్రయత్నించింది అన్న డౌట్ కలగవచ్చు. అయితే అది నిజమైన డైనోసార్ కాదు.
డైనోసార్ యూఎస్ఏ ఫ్యాన్ క్లబ్ అని ఉన్న ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి షేర్ చేసిన ఈ వీడియోలో రోడ్డుపై డైనోసార్ లాంటి ఒక జంతువు కనిపించడంతో దానిని చూడటానికి రోడ్డుకు ఇరు వైపులా కూడా చాలామంది జనం కూర్చుని కనిపిస్తున్నారు. ఇదే సమయంలోనే ఒక వ్యక్తి ఆ డైనోసార్ కి ఆహారం అందించడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ వ్యక్తి చేతిని కొరకడానికి ప్రయత్నించిన డైనోసార్ ఆతర్వాత వ్యక్తిని మొత్తాన్ని మింగడానికి ప్రయత్నిస్తుంది. దీంతో చుట్టుపక్కల ఉన్న మిగతా వాళ్లు అతనిని రక్షించే ప్రయత్నం చేస్తారు. మరి ఎన్నో వందల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్లు మళ్లీ ఎలా బతికి వచ్చాయి? అని అందరూ అనుకోవచ్చు. అయితే ఇదేదో ఎంటర్టైన్మెంట్ షోలో జరిగిన సన్నివేశం. డైనోసార్ వేషం వేసుకున్న మనిషి ఇలా చేసి ఉండి ఉండవచ్చు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.