Food combinations: ఈ పదార్థాలను పండ్లతో కలిపి తింటున్నారా? తస్మాత్‌ జాగ్రత్త..

Weird Food Combinations: మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. అయితే ఈ విషయం తెలిసినప్పటికీ చాలామంది ఫుడ్‌ విషయంలో అలక్ష్యం పాటిస్తున్నారు. యాంత్రిక జీవనంలో పడిపోయి ఏది పడితే అది తింటున్నారు

Food combinations: ఈ పదార్థాలను పండ్లతో కలిపి తింటున్నారా? తస్మాత్‌ జాగ్రత్త..
Weird Food Combinations
Follow us
Basha Shek

|

Updated on: Jul 04, 2022 | 10:14 AM

Weird Food Combinations: మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. అయితే ఈ విషయం తెలిసినప్పటికీ చాలామంది ఫుడ్‌ విషయంలో అలక్ష్యం పాటిస్తున్నారు. యాంత్రిక జీవనంలో పడిపోయి ఏది పడితే అది తింటున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా విస్తృతి బాగా పెరిగిపోయింది కాబట్టి చాలామంది అందులో ఫుడ్‌ కాంబినేషన్‌, ట్రిక్స్‌ను పాటిస్తుంటారు. ఈ అలవాట్లు ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. ఇక పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివైనా కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. మరి అలాంటి ఫుడ్‌ కాంబినేషన్లేంటో తెలుసుకుందాం రండి..

పైనాపిల్- పాలు

పాలలో మామిడి, అరటి మరియు ఇతర పండ్లను కలిపి షేక్స్ తయారుచేసుకుంటుటారు చాలామంది. అయితే కొన్ని పండ్లను పాలతో అస్సలు తినకూడదు. అందులో ఒకటి పైనాపిల్‌. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలతో పాటు అలెర్జీలు కూడా తలెత్తే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

బొప్పాయి- నిమ్మకాయ

నిమ్మకాయలో బొప్పాయి కలిపి తింటే కడుపులో ట్యాక్సిన్లు ఏర్పడే అవకాశముంది. ఇది డయేరియా వంటి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది.

జామ – అరటిపండు

చాలామంది ఫ్రూట్ చాట్‌ని ఇష్టపడవచ్చు. అయితే ఇందులో కొన్ని పండ్లను కలిపి తినకూడదు. అందులో జామ- అరంటి పండు కాంబినేషన్‌ ఒకటి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ రెండు పండ్లను కలిపి తినడం వల్ల వికారం, వాంతులు లేదా తలనొప్పి సమస్యలు వస్తాయి.

నీరు- పుచ్చకాయ

పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని కలిపి తీసుకుంటే డయేరియా లాంటి సమస్యలు తలెత్తే అవకాశముంది.

కూరగాయలతో పండ్లు..

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం క్యారెట్లు నారింజలను కలిపి తినడం మంచిది కాదు. ఎందుకంటే ఈ మిశ్రమం వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ సమస్యలు తలెత్తుతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..