Plastic Ban: కిలో ప్టాస్టిక్ తెచ్చిస్తే ప్లేట్ పోహా.. అరకిలోకైతే గ్లాస్ లెమన్ జ్యూస్.. ఎక్కడంటే..
Natural Plastic Cafe: ఇటీవల కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. జులై 1 నుంచి సింగిల్ ప్లాస్టిక్ తయారీ, దిగుమతి, నిల్వ మరియు అమ్మకాలను నిషేధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై..
Natural Plastic Cafe: ఇటీవల కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. జులై 1 నుంచి సింగిల్ ప్లాస్టిక్ తయారీ, దిగుమతి, నిల్వ మరియు అమ్మకాలను నిషేధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాతో పాటు శిక్షలు వేయాలని పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి గుజరాత్‌లోని ఓ కేఫ్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. ప్లాస్టిక్ వ్యర్థాలు అందజేస్తే.. రుచికరమైన భోజనం అందిస్తామంటూ ప్రకటించింది. ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో గుజరాత్‌లోని జునాగఢ్‌కు చెందిన నేచురల్ ప్లాస్టిక్ కేఫ్ ప్రకటన నెట్టింట్లో వైరల్‌గా మారింది. కేఫ్‌లోని ఆహార పదార్థాలను కొనుగోలు చేసేసమయంలో వినియోగదారులు డబ్బుకు బదులు ప్లాస్టిక్ వర్థాలను ఇచ్చినా.. స్వీకరిస్తామంటూ కేఫ్ నిర్వాహకులు తెలిపారు.
సంప్రదాయ గుజరాతీ వంటకాలు..
కాగా ఈ నేచురల్ ప్లాస్టిక్ కేఫ్‌ను సర్వోదయ సాక్షి సంఘం అనే మహిళల బృందం నిర్వహిస్తోంది. ప్లా్స్టిక్ వ్యర్థాల బరువును బట్టి మెనూలోని ఆహార పదార్థాలను కొనుగోలు చేయవచ్చు. కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకొస్తే ఒక ప్లేట్ ధోక్లా లేదా పోహా అందిస్తామని, అదే 500 గ్రామ్‌ల ప్లాస్టిక్ వ్యర్థాలకు ఒక గ్లాసు నిమ్మరసం ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. వీటితో పాటు సెవ్ టమోటా, బైంగన్ బర్తా, బజ్రా రోట్లా, గులాబీ, అత్తి పండ్లు, బెల్ ఆకులు, తమలపాకుతో చేసిన కొన్ని గుజరాతీ సంప్రదాయ వంటకాలను కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని వంటకాలను మట్టి పాత్రల్లోనే వడ్డిస్తామని తెలిపారు. కాగా ఈ కేఫ్ ప్రకటనను కలెక్టర్ రుచిత్ రాజ్ తన ట్విటర్ ఖాతాలో పంచుకోగా.. కేఫ్ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పర్యావరణ రక్షణలో ఇదో గొప్ప ముందడుగని కొనియాడుతున్నారు. ఇక ఈ కేఫ్ ద్వారా సేకరించిన వ్యర్థాలు జునాగఢ్ పరిపాలనశాఖతో ఒప్పందం కుదుర్చుకున్న రీసైక్లింగ్ ఏజెన్సీకి వెళ్తాయి.
આજ રોજ માન.રાજ્યપાલશ્રી @ADevvrat ના હસ્તે ઉદ્દઘાટન થનાર ‘ પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફે ‘ ના આયોજન અંગેની રીવ્યુ મિટિંગનું આયોજન જિલ્લાના સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે કરવામાં આવ્યું. @CMOGuj @pkumarias @rmanjhu @trajendrabjp @Manish_guj @iArvindRaiyani @brijeshmeja1 @RaghavjiPatel pic.twitter.com/fMAvVlGFVq
— Collector Junagadh (@collectorjunag) June 28, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..