Rishabh Pant: రిషబ్ మెరుపు సెంచరీ.. కోచ్ రాహుల్ సంబరాలు మాములుగా లేవుగా .. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
India vs England: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్ టెస్ట్ మొదటి రోజు ఆటలో రిషబ్ పంత్ (Rishabh Pant) సూపర్ సెంచరీ సాధించాడు . మొదట 89 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఈ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్..
India vs England: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్ టెస్ట్ మొదటి రోజు ఆటలో రిషబ్ పంత్ (Rishabh Pant) సూపర్ సెంచరీ సాధించాడు . మొదట 89 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఈ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్.. ఓవరాల్‌గా 111 బంతులాడి 20 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 146 పరుగులు చేశాడు. కాగా ఈ టెస్టులో ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 98 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో తన మెరుపు సెంచరీతో భారత్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు పంత్. రవీంద్ర జడేజా తో కలిసి ఆరో వికెట్ కు 222 పరుగులు జోడించి భారత్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. ఈక్రమంలో అసలు 200 పరుగులైనా చేస్తామా..? అన్న స్థితి నుంచి ఏకంగా భారత్ ను పటిష్ఠ స్థితిలో నిలిపిన పంత్‌పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఎప్పుడూ శాంతంగా కనిపించే కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా తన సంతోషాన్ని దాచుకోలేకపోయాడు. పంత్ సెంచరీ పూర్తి కాగానే తన సీట్లోంచి లేచి చప్పట్లు కొడుతూ రిషభ్ ను అభినందించాడు. ఈ క్రమంలో రాహుల్ సెలబ్రేషన్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.
ఇక మ్యాచ్‌లో టాస్ కోల్పోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. పంత్‌తో పాటు జడేజా (83 నాటౌట్) రాణించాడు. గిల్ (17), పుజారా (13), విహారి (20), కోహ్లీ (11), శ్రేయస్ (15) పూర్తిగా నిరాశపర్చారు. ప్రస్తుతం జడేజా, షమీ (0) క్రీజులో ఉన్నారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ (52/3), మాథ్యూ ప్యాట్స్ (85/2) సత్తాచాటారు.
You gotta be Rishabh Pant to make Rahul Dravid celebrate like that, what a knock!pic.twitter.com/buhmslVry6
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 1, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..