Heart Care: మీకు 30 ఏళ్లు దాటాయా? అయితే గుండె ఆరోగ్యం కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..

Heart Care: బిజీలైఫ్‌కు తోడు అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల యుక్త వయసులోనే చాలామంది తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో ఖనిజాలు, విటమిన్ల లోపం ఏర్పడుతోంది. ఫలితంగా చిన్న వయసులోనే గుండెకు సంబంధించిన అనేక రకాల వ్యాధులు

Heart Care: మీకు 30 ఏళ్లు దాటాయా? అయితే గుండె ఆరోగ్యం కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
Heart Health
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Jul 01, 2022 | 9:01 AM

Heart Care: బిజీలైఫ్‌కు తోడు అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల యుక్త వయసులోనే చాలామంది తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో ఖనిజాలు, విటమిన్ల లోపం ఏర్పడుతోంది. ఫలితంగా చిన్న వయసులోనే గుండెకు సంబంధించిన అనేక రకాల వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. వరల్డ్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, కార్డియోవాస్కులర్ డిసీజ్ (CVD) మరణాలు ఇటీవల బాగా పెరిగాయట. తాజా పరిశోధనలు, అధ్యయనాలు కూడా గుండె ఆరోగ్యానికి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. వ్యాధి చికిత్స కంటే నివారణే ముఖ్యం. ఎందుకంటే మన జీవన నాణ్యత మన గుండె ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత గుండె ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

రెగ్యులర్ నడక, వ్యాయామం

నడక చాలా సులభం అలాగే ఉత్తమ వ్యాయామాలలో ఇదీ ఒకటి. రోజూ వాకింగ్ చేయడం వల్ల గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు. అదనంగా రక్తంలో చక్కెర స్థాయులను అదుపుల ఉంచుకోవచ్చు. బరువును అదుపులో ఉంచుకోవడానికి రెగ్యులర్ శారీరక శ్రమ చాలా ముఖ్యం. దీని కోసం, మీరు ఇంట్లోనే సాధారణ వ్యాయామాలు చేయవచ్చు లేదా ఫిట్‌నెస్ గైడ్‌లతో జిమ్‌లో చేరవచ్చు. మార్నింగ్ వాక్ లేదా సైక్లింగ్ కూడా ఆరోగ్యానికి మంచిది.

ఇవి కూడా చదవండి

పొగాకు, మద్యానికి దూరంగా..

ధూమపానం, మద్యపానం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. చిన్న వయసులోనే గుండె సంబంధ వ్యాధులు తలెత్తుతాయి. అందుకే ధూమపానం, మద్యాపానం అలవాట్లకు దూరంగా ఉండాలి.

సరైన నిద్ర

మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి సంబంధించిన లక్షణాలలో ఒకటి. కాబట్టి రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోండి. శరీరంలో పేరుకుపోయే అదనపు కొవ్వును నియంత్రించడానికి బరువు నిర్వహణ చాలా ముఖ్యం. అధిక బరువు గుండెకు ప్రమాదం. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ గుండె సాధారణ పనితీరును ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా వివిధ వ్యాధులకు కారణమవుతాయి.

పోషకాహారానికే ప్రాధాన్యం..

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార నియమాలను పాటించాలి. ఉదాహరణకు, వేయించిన మాంసాన్ని తినకుండా ఉండండి. చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడంతో ఇది మీ శరీరంలో రక్తపోటు స్థాయులను పెంచుతుంది. కాబట్టి పాలక్ ఫ్లో, చిలఖర్వీ, చక్కోట వంటి ఆకుకూరలు బాగుంటాయి. కూరగాయలలో బ్రోకలీ, మిరపకాయ. పండ్లలో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ. వాల్నట్, బాదం. సోయా ప్రోటీన్ తదితర తృణధాన్యాలు. ఈ ఆహారాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఒత్తిడి నుంచి దూరంగా..

ఇవన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. రోజువారీ జీవితంలో ఆందోళన, ఒత్తిడి కలిగించే అంశాలకు దూరంగా ఉండాలి. డిప్రెషన్‌తో బాధపడుతుంటే మానసిక వైద్యుని సలహా తీసుకోండి. మనశ్శాంతికి సంతోషం చాలా ముఖ్యం. కాబట్టి మీ మనస్సు కోరుకునే వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నించండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..