Jr NTR: అనారోగ్యంతో ఉన్న అభిమానికి అండగా నిలిచిన యంగ్‌ టైగర్‌.. నేనున్నానంటూ భరోసా..

Jr NTR:  యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR NTR) సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ హీరోనే అని చాలా సార్లు అనిపించుకున్నాడు. ముఖ్యంగా తనను ఆరాధించే అభిమానులు ఆపదలో ఉన్నారంటే ఆదుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు.

Jr NTR: అనారోగ్యంతో ఉన్న అభిమానికి అండగా నిలిచిన యంగ్‌ టైగర్‌.. నేనున్నానంటూ భరోసా..
Jr Ntr
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jun 30, 2022 | 8:55 AM

Jr NTR:  యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR NTR) సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ హీరోనే అని చాలా సార్లు అనిపించుకున్నాడు. ముఖ్యంగా తనను ఆరాధించే అభిమానులు ఆపదలో ఉన్నారంటే ఆదుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తాజాగా అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అభిమానికి ధైర్యాన్ని నూరిపోశాడు తారక్‌. అధైర్యపడకుండా దేవుడిని నమ్మండని, త్వరలోనే అతను కోలుకుని వస్తాడని, తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.   జనార్ధన్‌ అనే అభిమాని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే తన అభిమాన హీరో ఎన్టీఆర్‌తో మాట్లాడాలనుకున్నారు. అభిమాన సంఘం నాయకులు ఈ విషయాన్ని ఎన్టీఆర్‌కి చేరవేశారు. దీంతో వెంటనే జనార్ధన్‌, అతని తల్లితోనూ ఫోన్‌లో మాట్లాడారు.

‘నేను ఎన్టీఆర్‌ను మాట్లాడుతున్నాను, నువ్వు త్వరగా కోలుకుంటే మనం కలుద్దాం. మేం అందరం నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. నిన్ను చూడాలని ఉంది. త్వరగా కోలుకుని వచ్చేయ్‌.. నీకోసం ప్రార్థిస్తున్నాం. నీకోసం నేనున్నాను, మన అభిమానులున్నారు. నువ్వు త్వరగా కోలుకుని వచ్చేసేయ్‌, కలుద్దాం. నీకేం అవదు’ అంటూ ధైర్యాన్ని నూరిపోశాడు. ఈ సందర్భంగా తారక్‌ వారి అమ్మతో మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌30 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఆగస్ట్ లో ప్రారంభంకావచ్చునని తెలుస్తోంది. మరోవైపు కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తోనూ ఓ సినిమా చేయనున్నాడు తారక్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ