లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ ఇంత అందంగా ఉంటుందా?.. రోడ్లపై తిరుగుతున్న వాడితో ప్రేమ, పెళ్లి.. నెట్టింట్లో వైరలవుతోన్న బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీ..

Beautiful Love Story: లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌.. సాధారణంగా సినిమాల్లోనే ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంది. నిజ జీవితంలో చాలామంది తొలిచూపు ప్రేమ అనే మాటలను పెద్దగా నమ్మరు. పట్టించుకోరు కూడా. అయితే..

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ ఇంత అందంగా ఉంటుందా?.. రోడ్లపై తిరుగుతున్న వాడితో ప్రేమ, పెళ్లి.. నెట్టింట్లో వైరలవుతోన్న బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీ..
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jun 29, 2022 | 7:34 AM

Beautiful Love Story: లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌.. సాధారణంగా సినిమాల్లోనే ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంది. నిజ జీవితంలో చాలామంది తొలిచూపు ప్రేమ అనే మాటలను పెద్దగా నమ్మరు. పట్టించుకోరు కూడా. అయితే లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అనేది ఎంతో అందంగా ఉంటుంది. అదే తమ ప్రేమ బంధానికి గట్టి పునాది వేసిందంటున్నారు ఓ ప్రేమ జంట. పెళ్లిపీటల దాకా నడిపించిందని మురిసిపోతున్నారు. మరి ఆ ప్రేమకథేంటో, ఆ ప్రేమికులెవరో తెలుసుకుందాం రండి. మెక్సికోలోని మైకోకాన్‌లోని న్యూవో శాన్ జువాన్‌కు చెందిన లుజ్ యెసేనియా గెరోనిమో సెర్నా అనే యువ‌తి 2009లో కార్లు కడుగుతున్న దుకాణం వెలుపల జువాన్ మెన్డోజా అల్విజార్‌ అనే యువకుడిని చూసింది. జువాన్‌ ఓ నిరాశ్రయుడు. ఓ కార్ల షోరూంలో ప‌నిచేసేవాడు. కార్లు తుడుస్తూ బ‌తుకీడ్చేవాడు. చింపిరి జుట్టు, మాసిన బ‌ట్టలతోనే వీధుల్లో తిరిగేవాడు. వ‌చ్చిన డ‌బ్బుల‌తో పొట్ట నింపుకుని రోడ్లపై నిద్రపోయేవాడు. కానీ అతను చాలా సంస్కార‌వంతుడు. ఎదుటివారితో ఇట్టే కలిసిపోతాడు. ఇదే సెర్నాను ఆకట్టుకుంది. తొలిచూపులోనే అత‌నితో ప్రేమ‌లో ప‌డిపోయింది.

పదేళ్ల దాంపత్య బంధం..

జువాన్‌తో మాట‌క‌లిపిన లుజ్ మొద‌ట అతడికి హెయిర్‌క‌ట్ చేయించింది. హెయిర్ క‌ట్ త‌ర్వాత అత‌డి రూప‌మే మారిపోయింది. లుజ్ కళ్లకు జువాన్ ఓ సినిమాహీరోలా క‌నిపించాడు. అంతే అత‌నితో ప్రేమ‌లో ప‌డింది. ఇద్దరూ రెండేళ్ల పాటు ప్రేమలో మునిగితేలారు. ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి 2012లో జువాన్‌తో కలిసి ఏడడుగులు నడిచింది. వారి పదేళ్ల అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం జువాన్ తాపీ ప‌నిచేస్తున్నాడు. ఖాళీ స‌మ‌యాల్లో మొబైల్ ఫోన్స్ రిపేర్లు చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ అంద‌మైన ప్రేమ క‌థ‌తోపాటు అప్పుడు వీధుల్లో సంచ‌రిస్తున్న జువాన్‌ ఫొటోల‌ను లుజ్ తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో అవికాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారాయి. రోడ్డు పక్కన నిద్రించే ఓ నిరాశ్రయుడిని ప్రేమించి పెళ్లాడి అతనికి కొత్త జీవితం ప్రసాదించిన లుజ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘నువ్వు రాణివి.. అత‌డిని నీ జీవితంలోకి ఆహ్వానించి మంచి లైఫ్ ఇచ్చావ్. నిజమైన ప్రేమ ఇలాగే ఉంటుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.  (Source)

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
చేతులు పొడిబారి దురద పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. టిప్స్ మీకోసం
చేతులు పొడిబారి దురద పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. టిప్స్ మీకోసం
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!