యుద్ధం ప్రభావంతో సినీ రంగం గ్యాస్ కొరతను ఎదుర్కొంటోంది. షూటింగ్లలో వందలాది మంది సిబ్బందికి అందించే ఫుడ్ మెనూలో కోతలు తప్పడం లేదు. గతంలో రకరకాల వంటకాలతో కూడిన భోజనం ఇప్పుడు తగ్గిపోయింది. టిఫిన్ వెరైటీలు కూడా కుదించబడుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే బడ్జెట్లు పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.