Rocketry: మాధవన్ ‘రాకెట్రీ’ని వీక్షించిన సీబీఐ మాజీ అధికారులు.. సినిమా గురించి ఏమన్నారంటే..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ (Nambi Narayanan) జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం 'రాకెట్రీ' (Rocketry). ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ (R Madhavan) తొలిసారిగా దర్శకుడిగా మారి ఈచిత్రాన్ని తెరకెక్కించాడు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ (Nambi Narayanan) జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ’ (Rocketry). ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ (R Madhavan) తొలిసారిగా దర్శకుడిగా మారి ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. సీనియర్ నటీమణి సిమ్రన్ కీలక పాత్రలో నటించింది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో షారుఖ్, సూర్య కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటోంది చిత్రబృందం. ఇదిలా ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) మాజీ అధికారుల కోసం రాకెట్రీ స్పెషల్ ప్రీమియర్ షోను వేశారు. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియం ఈ స్పెషల్ స్ర్కీనింగ్ ఏర్పాటుచేశారు. మాజీ డైరెక్టర్ కార్తికేయన్‌తో సహా పలువురు సీబీఐ అధికారులు, కొందరు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా రాకెట్రీ సినిమాపై తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకన్నారు.. ‘రాకెట్రీ చిత్రం చాలా అద్భుతంగా ఉంది. మాధవన్ ఎంతో అర్థవంతంగా, ఆకర్షణీయంగా, వినోదాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సైన్స్, టెక్నాలజీ, ఎమోషన్ కలగలసిన అద్భుతమైన సినిమా ఇది’ అని సీబీఐ మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ పి.ఎం.నాయర్ తెలిపారు. నంబి నారాయణన్‌లా ఇస్రో అభివృద్ధి కోసం తమ జీవితాన్ని ధారపోసిన వేలాదిమంది శాస్త్రవేత్తలకు ఈ చిత్రం అంకితమని కేంద్ర సమాచార, ప్రసార శాఖల కార్యదర్శి అపూర్వ చంద్ర పేర్కొన్నారు. కాగా సినిమాల్లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న మాధవన్ సాంకేతికత అంశాలతో ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అంతేకాదు శాస్త్రవేత్త నారాయణన్‌లా కనిపించేందుకు తన శరీరాకృతిని మార్చుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..