Ramcharan: చెర్రీ ఇంట్లో సల్మాన్‌, వెంకీ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా బుట్టబొమ్మ.. ఫ్యాన్స్‌ను ఖుషి చేస్తోన్న ఫొటోస్‌..

Ramcharan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తోన్న తాజా చిత్రం కభీ ఈద్ కభీ దివాళీ (Kabhi Eid Kabhi Diwali). ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ (Venkatesh) ఓ అతిథి పాత్రలో..

Ramcharan: చెర్రీ ఇంట్లో సల్మాన్‌, వెంకీ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా బుట్టబొమ్మ.. ఫ్యాన్స్‌ను ఖుషి చేస్తోన్న ఫొటోస్‌..
Ram Charan
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jun 27, 2022 | 6:32 AM

Ramcharan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తోన్న తాజా చిత్రం కభీ ఈద్ కభీ దివాళీ (Kabhi Eid Kabhi Diwali). ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ (Venkatesh) ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అదేవిధంగా మన బుట్టబొమ్మ పూజాహెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర బృందం మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan) ఇంట్లో ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి. స్టార్‌ నటీనటులందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్‌ ఖుషి అవుతున్నారు. కాగా చెర్రీ, ఆయన సతీమణి ఉపాసన సల్మాన్‌, వెంకీ, పూజాలను లంచ్‌కి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే చెర్రీ ఇంట్లో వీరంతా సరదాగా గడిపినట్లు సమాచారం.

కాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల తరచూ హైదరాబాద్‌ వస్తూ మెగా ఫ్యామిలీని కలుస్తూ ఉన్నారు. ఇటీవలే కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో చిరంజీవి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొని సందడి చేశారు. ఇక కభీ ఈద్ కభీ దివాళీ సినిమాలో జగపతిబాబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..