Kiccha Sudeep: అభిమాన క్రికెటర్‌ నుంచి సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌ అందుకున్న కిచ్చా సుదీప్‌.. ఉబ్బితబ్బిబ్బవుతోన్న కన్నడ సూపర్‌ స్టార్‌..

Vikrant Rona: కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) గురించి ప్రత్యేక పరిచయ అవసరం లేదు. తెలుగులో ఈగ సినిమాలో విలన్ గా మెప్పించి తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడీ సూపర్‌ స్టార్‌.

Kiccha Sudeep: అభిమాన క్రికెటర్‌ నుంచి సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌ అందుకున్న కిచ్చా సుదీప్‌.. ఉబ్బితబ్బిబ్బవుతోన్న కన్నడ సూపర్‌ స్టార్‌..
Kiccha Sudeep
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jun 27, 2022 | 12:14 PM

Vikrant Rona: కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) గురించి ప్రత్యేక పరిచయ అవసరం లేదు. తెలుగులో ఈగ సినిమాలో విలన్ గా మెప్పించి తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడీ సూపర్‌ స్టార్‌. ఈక్రమంలోనే తన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తున్నాడు. తాజాగా ఈ స్టార్ హీరో ఓ భారీ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే విక్రాంత్ రోణ‌ (Vikrant Rona). ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మించిన ఈ చిత్రాన్ని అనుప్‌ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. జూలై 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టు్కుంటోంది. ఇదిలా ఉంటే విక్రాంత్‌రోణ ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోన్న సుదీప్‌కు తన అభిమాన క్రికెటర్‌ నుంచి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అందింది. దీంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడీ స్టార్‌ హీరో. ఆ అభిమాన క్రికెటర్‌ మరెవరో కాదు టీమిండియాకు మొదటి ప్రపంచకప్‌ సాధించి పెట్టిన కపిల్‌ దేవ్‌ (Kapil Dev). ఈమాజీ క్రికెటర్‌కు సుదీప్‌ పెద్ద అభిమాని. ఆ అభిమానంతోనే కపిల్ బయోపిక్‌ 83 కన్నడ వెర్షన్ సినిమాను కర్ణాటకలో విడుదల చేశాడు సుదీప్.

తాజాగా ఈ స్టార్‌ యాక్టర్‌కి కపిల్ దేవ్ 1983 వరల్డ్ కప్‌లో ఉపయోగించిన క్లాసిక్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని సుదీప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘వాహ్.. వాట్ ఎ సండే.. థాంక్ యూ కపిల్ దేవ్ సర్.. ఇది ఊహించలేదు. ఇది క్లాసిక్ పీస్.. ఆనందంతో మబ్బుల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తోంది.. థాంక్యూ, థాంక్యూ’ అంటూ లవ్‌ ఎమోజీలను షేర్‌ చేశాడు సుదీప్‌. ఈ బ్యాట్‌పై 1983 వరల్డ్ కప్‌లో ఆడిన అందరి ఆటగాళ్ల సంతకాలు ఉండటం విశేషం. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..