AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రాజెక్ట్ కే యూనిట్‏కు ప్రభాస్ గ్రాండ్ పార్టీ.. నెట్టింట వైరలవుతున్న వీడియో..

ఈ పార్టీకి బిగ్ బీ అమితాబ్, డైరెక్టర్ నాగ్ అశ్వీన్ తోపాటు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.. అంతేకాకుండా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.

Prabhas: ప్రాజెక్ట్ కే యూనిట్‏కు ప్రభాస్ గ్రాండ్ పార్టీ.. నెట్టింట వైరలవుతున్న వీడియో..
PrabhasImage Credit source: TV9 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 27, 2022 | 7:06 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నాడు.. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. సౌత్ , నార్త్ అనే తేడా లేకుండా భారీగా ఫాలోవర్లను సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం.. ఇటీవలే ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ చిత్రానికి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్స్ పై మరింత శ్రద్ద తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హీరో చేతిలో సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.. ఇందులో ప్రాజెక్ట్ కే షూటింగ్ హైదరాబాద్‍లో జరుగుతుంది. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ పూర్తిచేసుకుంది.

దీంతో ఈ చిత్రయూనిట్‏కు ప్రభాస్ గ్రాండ్ పార్టీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీకి బిగ్ బీ అమితాబ్, డైరెక్టర్ నాగ్ అశ్వీన్ తోపాటు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.. అంతేకాకుండా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో అమితాబ్ కీలకపాత్రలలో నటిస్తుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

16 ఏళ్లల్లో ఒకే ఒక్క హిట్టు అందుకున్న హీరోయిన్.. చేసిన సినిమాలన్న
16 ఏళ్లల్లో ఒకే ఒక్క హిట్టు అందుకున్న హీరోయిన్.. చేసిన సినిమాలన్న
వంట గదే బ్యూటీ పార్లర్.. ఈ 8 ఐటెమ్స్ ఇచ్చే షాకింగ్ బెనిఫిట్స్ ఇవి
వంట గదే బ్యూటీ పార్లర్.. ఈ 8 ఐటెమ్స్ ఇచ్చే షాకింగ్ బెనిఫిట్స్ ఇవి
రామ్ చరణ్ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడో తెలుసా?
రామ్ చరణ్ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడో తెలుసా?
ఇండియాలో 107 మంది పాకిస్తాన్‌ పౌరులు మిస్సింగ్‌!
ఇండియాలో 107 మంది పాకిస్తాన్‌ పౌరులు మిస్సింగ్‌!
తెల్ల నేరేడు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా!
తెల్ల నేరేడు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా!
ఫ్రిజ్‌లో రోజుల తరగడి బాటిల్‌ నీళ్లు నిల్వ చేసే అలవాటు మీకూ ఉందా?
ఫ్రిజ్‌లో రోజుల తరగడి బాటిల్‌ నీళ్లు నిల్వ చేసే అలవాటు మీకూ ఉందా?
అందరూ ఇష్టంగా లాగించేస్తారు..? కానీ.. ఇవి విషంతో బరాబర్‌ అంట..
అందరూ ఇష్టంగా లాగించేస్తారు..? కానీ.. ఇవి విషంతో బరాబర్‌ అంట..
బ్యాటర్ వికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా, వద్దంటోన్న చెత్త బౌలర్
బ్యాటర్ వికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా, వద్దంటోన్న చెత్త బౌలర్
వేసవిలో అధిక వేడితో తలనొప్పి వస్తుందా? చిటికెలో ఉపశమనం పొందాలంటే
వేసవిలో అధిక వేడితో తలనొప్పి వస్తుందా? చిటికెలో ఉపశమనం పొందాలంటే
ఉగ్రదాడిపై విచారణ మొదలుపెట్టిన NIA
ఉగ్రదాడిపై విచారణ మొదలుపెట్టిన NIA