AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: మహిళల కోసం వాట్సప్‌లో సరికొత్త ఫీచర్‌.. నెలసరిని సులువుగా ట్రాక్‌ చేసేందుకు వీలుగా..

WhatsApp:  యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (WhatsApp). వినియోగదారుల ఆసక్తి, అవసరాలకు అనుగుణంగా సదుపాయాలను తీసుకొస్తుండడంతో..

WhatsApp: మహిళల కోసం వాట్సప్‌లో సరికొత్త ఫీచర్‌.. నెలసరిని సులువుగా ట్రాక్‌ చేసేందుకు వీలుగా..
Whatsapp
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 27, 2022 | 6:31 AM

Share

WhatsApp:  యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (WhatsApp). వినియోగదారుల ఆసక్తి, అవసరాలకు అనుగుణంగా సదుపాయాలను తీసుకొస్తుండడంతో ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ అగ్రస్థానంలో ఉంది. సమాచార మార్పిడి నుంచి ఆన్‌లైన్ పేమెంట్, షాపింగ్‌, బ్యాంకింగ్‌, మెడికల్‌ రంగాలకు సంబంధించిన సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ సంస్థలు కూడా చాట్‌బాట్‌ సహాయంతో వాట్సాప్‌ యూజర్లకు సేవలందిస్తున్నాయి. ఈక్రమంలో ప్రత్యేకించి మహిళల కోసం మరో అధునాతన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్‌ యాజమాన్యం. మహిళలు తమ నెలసరి (menstrual cycle)ని సులువుగా ట్రాక్‌ చేసేందుకు వీలుగా సిరోనా హైజీన్ ప్రైవేట్ లిమిటెడ్(Sirona Hygiene Pvt. Ltd) అనే సంస్థతో కలిసి వాట్సాప్‌ ఈ సేవలను ప్రారంభించింది. భారత దేశంలో తొలిసారిగా వాట్సాప్‌ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సిరోనా హైజీన్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో దీప్ బజాజ్ తెలిపారు.

మహిళల జీవన ప్రమాణ ప్రమాణాలు పెంచేందుకు..

వాట్సాప్‌ ద్వారా ఈ చాట్‌బాట్‌ నెలసరి ట్రాకింగ్‌, గర్భదారణ, గర్భదారణ నివారణ వంటి మూడు రకాల సేవలను మహిళలకు అందిస్తోంది. ఈ సేవలను పొందేందుకు గాను మహిళలు ముందుగా తమ నెలసరికి సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. అలా నమోదు చేసిన సమాచారాన్ని చాట్‌బోట్‌ రికార్డు చేసి కచ్చితమైన నెలసరి తేదీని యూజర్‌కు తెలియజేస్తుంది. అంతేకాకుండా యూజర్‌కు ముందుగానే నెలసరి తేదీకి సంబంధించి రిమైండర్‌ను పంపుతుంది. ఇందుకోసం యూజర్లు +919718866644 అనే నంబర్‌కు హాయ్‌ (Hi) అని మెసేజ్‌ చేయాలి. తర్వాత చాట్‌బోట్ చూపించే మూడు ఆప్షన్లలో పిరియడ్‌ ట్రాకర్‌ అన్నదానిని ఎంచుకోవాలి. ఆ తర్వాత నెలసరికి సంబంధించిన ప్రాథమిక వివరాలు నమోదు చేసి ఈ సేవలను పొందవచ్చు. మన రోజువారీ జీవితంలో అంతర్భాగమైన వాట్సాప్‌ ద్వారా మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు దీప్‌ బజాజ్‌ తెలిపారు. ఈ సదుపాయం ద్వారా మహిళలు మరింత సులువుగా తమ నెలసరికి సంబంధించిన సమాచారాన్ని పొందగలరని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..