AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియన్‌ మార్కెట్లోకి iQOO Z11x 5G… ఫీచర్లు, ధర చూస్తే మతిపోవాల్సిందే!

iQOO Z11x 5G మార్చి 12న భారతదేశంలో విడుదలవుతుంది. రూ.23,000 అంచనా ధరతో అమెజాన్‌లో ప్రత్యేకంగా లభించే ఈ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ 7200mAh భారీ బ్యాటరీ, MediaTek Dimensity 7400 Turbo చిప్‌తో వస్తుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్, దీర్ఘకాలిక బ్యాటరీ జీవితం, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో iQOO Z10x 5Gకి పెద్ద అప్‌గ్రేడ్‌గా వస్తోంది.

ఇండియన్‌ మార్కెట్లోకి iQOO Z11x 5G… ఫీచర్లు, ధర చూస్తే మతిపోవాల్సిందే!
Iqoo Z11x 5g
SN Pasha
|

Updated on: Mar 03, 2026 | 10:26 PM

Share

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మిడ్‌రేంజ్ విభాగాన్ని టార్గెట్ చేస్తూ iQOO Z11x 5Gను కంపెనీ మార్చి 12న మధ్యాహ్నం భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధమైంది. అమెజాన్ ఇండియాలో ప్రత్యేకంగా విక్రయించనున్న ఈ ఫోన్ గత ఏడాది వచ్చిన iQOO Z10x 5G కంటే పెద్ద అప్‌గ్రేడ్‌గా కంపెనీ పేర్కొంటోంది. లీకులు, లిస్టింగ్‌ల ప్రకారం.. iQOO Z11x 5G (8GB RAM + 256GB స్టోరేజ్) ధర సుమారు రూ.23,000 వరకు ఉండొచ్చని అంచనా. బ్లాక్, మింట్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఫోన్ అందుబాటులోకి రానుంది. దీంతో ఇది మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో పోటీని పెంచే అవకాశం ఉంది.

భారీ బ్యాటరీ హైలైట్

ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 7,200mAh భారీ బ్యాటరీ. ఈ ధరలో ఇది అత్యంత పెద్ద బ్యాటరీలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కంపెనీ ప్రకారం.. 40 గంటల వీడియో స్ట్రీమింగ్, 93 గంటల మ్యూజిక్‌, 15.4 గంటల గేమింగ్, సుమారు 19 గంటల సోషల్ మీడియా యూసేజ్‌కు ఉపయోగపడనుంది. బ్యాటరీ ఆరోగ్యం ఆరు సంవత్సరాల వరకు నిలబడేలా రూపొందించామని iQOO చెబుతోంది.

పర్ఫార్మెన్స్ కోసం MediaTek Dimensity 7400 Turbo చిప్‌ను ఉపయోగించారు. AnTuTuలో 10 లక్షలకు పైగా స్కోర్ వస్తుందని కంపెనీ పేర్కొంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ఇది మంచి ఎంపికగా భావిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ పరంగా Android 16 ఆధారిత OriginOS 6తో ఫోన్ వస్తుంది. డిజైన్‌లో గుండ్రని అంచులతో చదరపు కెమెరా మాడ్యూల్ ఇచ్చారు. డ్యూయల్ కెమెరా సెటప్, LED ఫ్లాష్, రింగ్ లైట్ ఉన్నాయి. పూర్తి కెమెరా వివరాలు ఇంకా వెల్లడి కాలేదు కానీ గత మోడల్ కంటే అప్‌గ్రేడ్ ఉంటుందని కంపెనీ సంకేతాలు ఇచ్చింది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us