AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep Superfoods: నిద్రలేమితో బాధపడుతున్నారా.? అయితే రాత్రిళ్లు పడుకునే ముందు ఈ సూపర్‌ఫుడ్స్‌ను తీసుకోండి..

Health Tips: పని ఒత్తిడి, మానసిక ఆందోళన, పోషకాహారలేమి తదితర కారణాలతో నేడు చాలామంది నిద్రలేమి( Insomnia) సమస్యతో బాధపడుతున్నారు. వినడానికి ఇది చిన్న సమస్యలాగే అనిపించినా..

Sleep Superfoods: నిద్రలేమితో బాధపడుతున్నారా.? అయితే రాత్రిళ్లు పడుకునే ముందు ఈ సూపర్‌ఫుడ్స్‌ను తీసుకోండి..
Sleep Superfoods
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 27, 2022 | 6:32 AM

Share

Health Tips: పని ఒత్తిడి, మానసిక ఆందోళన, పోషకాహారలేమి తదితర కారణాలతో నేడు చాలామంది నిద్రలేమి( Insomnia) సమస్యతో బాధపడుతున్నారు. వినడానికి ఇది చిన్న సమస్యలాగే అనిపించినా దానితో ఇబ్బంది పడే వారు మాత్రం నరకం అనుభవిస్తుంటారు. ఈక్రమంలో నిద్రలేమి సమస్య నుంచి బయటపడడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు మెడిసిన్స్‌ను కూడా వాడుతుంటారు. అయితే వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే ఎలాంటి మెడిసిన్స్‌తో పని లేకుండా కేవలం కొన్ని ఆహార పదార్థాలతో నిద్రలేమికి చెక్‌ పెట్టవచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.

మఖానా మఖానాను ఒక గ్లాసు పాలలో మరిగించి రోజూ రాత్రి నిద్రిస్తున్నప్పుడు తీసుకోవాలి. దీన్ని తీసుకోవడం వల్ల నిద్ర తీరు మెరుగుపడుతుంది. మఖానాలోని పోషకాలు ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. తద్వారా ప్రశాంతంగా నిద్ర పొందడంలో ఇవి సహాయపడతాయి.

బాదం బాదం నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బాదంపప్పులో మెలటోనిన్ ఉంటుంది. ఇది ప్రశాంతంగా నిద్రపోయేందుకు సహకరిస్తుంది.

ఇవి కూడా చదవండి

చమోమిలే టీ నిద్రపోయే ముందు చమోమిలే టీని తీసుకోవచ్చు. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. తద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇదొక్కటే కాదు చమోమిలే టీ తాగడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

డార్క్ చాక్లెట్ నిద్రను కలిగించే ఉత్తమ స్నాక్స్‌లో డార్క్ చాక్లెట్ ఒకటి. ఇందులో సెరోటోనిన్ కూడా ఉంటుంది. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది. మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది. (నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..