Monsoon Diet Tips: వర్షాకాలం వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే ఈ పండ్లను మెనూలో చేర్చుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా?
Benefits of Plum Fruits: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే పోషకాహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. అందులోనూ పోషక విలువలు పుష్కలంగా ఉన్న సీజనల్ ఫ్రూట్స్‌ను మెనూలో..
Benefits of Plum Fruits: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే పోషకాహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. అందులోనూ పోషక విలువలు పుష్కలంగా ఉన్న సీజనల్ ఫ్రూట్స్‌ను మెనూలో కచ్చితంగా భాగం చేసుకోవాలి. అందులోనూ వివిధ విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉండే ప్లమ్ పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్లమ్ పండ్లలో చాలా రకాలున్నాయి. మన దేశంలో అలూ బుఖారా పండ్లు ఇలాంటివే. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వీటిని డ్రైఫ్రూట్స్‌గా తీసుకుంటారు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లో అలూ బుఖారాలను పండిస్తారు. రుచికరమైన ఈ పండ్లలో పొటాషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. వీటిలోని విటమిన్ సి కళ్లకు చాలా మేలు చేస్తుంది. ఈ పండులోని పోషకాలు పలు అనారోగ్య సమస్యలను అధిగమించడానికి సహాయపడుతాయి. ఈ పండ్లను అనేక విధాలుగా తినవచ్చు. షర్బత్ రూపంలో కూడా తీసుకోవచ్చు. మరి ఈ పండ్లతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం రండి.
ఆరోగ్యకరమైన జుట్టు కోసం..
రేగు పండ్లు తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా జుట్టు పెరగడానికి, ఒత్తుగా మారడానికి సహాయపడుతుంది.
మలబద్ధకం నుండి ఉపశమనం..
రేగు పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి విముక్తి కలిగిస్తుంది. ఇందులో ఇసాటిన్, సార్బిటాల్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
క్యాన్సర్ ప్రమాదాన్ని..
శరీరంలో క్యాన్సర్ కణాలను పెరగనివ్వని పోషకాలు ప్లమ్ పండ్లలో ఉంటాయి. ఇందులోని బీటా కెరోటిన్ క్యాన్సర్‌ను నిరోధించడానికి పనిచేస్తుంది. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మానసిక ఒత్తిళ్ల నుంచి..
ఈ పండ్లలో క్లోరోజెనిక్ యాసిడ్‌తో పాటు ఇతర లక్షణాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒత్తిడి లేదా ఆందోళనగా అనిపించినప్పుడు ఈ పండ్లను తింటే మనసు కుదుటపడుతుంది.
జీవక్రియ రేటు..
ప్లమ్ పండ్లు జీవక్రియ రేటును కూడా పెంచుతాయి. ఇందులో ఫైబర్ జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది. అంతేగాకుండా శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. వేగంగా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
చర్మం ఆరోగ్యానికి..
ఈ పండ్లు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముడతలతో సహా చర్మంపై మచ్చలను తగ్గిస్తుంది.
ఎముకలు దృఢంగా మారేందుకు..
రేగు పండ్లలో విటమిన్ కె ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..