AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Sree: అరె..బిగ్ బాస్ బ్యూటీకి ఏమైంది? ముఖంపై గాయాలతో అశ్విని శ్రీ.. వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అశ్విని శ్రీ ఒకరు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆమె బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైంది.

Ashwini Sree: అరె..బిగ్ బాస్ బ్యూటీకి ఏమైంది? ముఖంపై గాయాలతో అశ్విని శ్రీ.. వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్
Bigg Boss Fame Ashwini Sree
Basha Shek
|

Updated on: Mar 16, 2026 | 9:48 AM

Share

బిగ్ బాస్ ఫేమ్, టాలీవుడ్ ప్రముఖ నటి అశ్విని శ్రీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాలు చేసిన ఈ అమ్మడు బిగ్ బాస్ ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. విజేతగా నిలవకున్నా తన అందం, క్యూట్ నెస్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాలు, టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో పంచుకుంటుంది. అలా తాజాగా అశ్విని శ్రీ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. తన మొహానికి గాయాలైనట్లు ఈ వీడియోలో వెల్లడించింది. ‘ఉదయాన్నే కుక్కను వాకింగ్‌కు తీసుకెళుతుంటే ప్రమాదవశాత్తూ కింద పడ్డాను. ముఖం మీద గాయాలయ్యాయి. ఇలా మీ ముందుకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ముఖానికి దెబ్బలు తగలడంతో చాలా నొప్పిగా ఉంది. మీరంతా నాకోసం ప్రార్థిస్తున్నారని ఆశిస్తున్నా’ అంటూ వీడియోను పోస్ట్ చేసింది అశ్విని శ్రీ.

ప్రనస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన బిగ్ బాస్ సెలబ్రిటీలు, సన్నిహితులు, స్నేహితులు స్పందిస్తున్నారు. అశ్విని శ్రీ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. కాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన అశ్విని శ్రీ కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో నటించింది. సహాయక నటిగా మెప్పించింది. అయితే పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. సర్దార్ గబ్బర్ సింగ్, రాజా ది గ్రేట్, బీటెక్ బాబులు, అమీర్ పేటలో తదితర చిత్రాల్లో నటించింది. అలాగే పలు మ్యూజిక్ వీడియోలు, టెలివిజన్ సీరియల్స్‌లో కనిపించింది.

ఇవి కూడా చదవండి

అశ్విని శ్రీ షేర్ చేసిన వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు