Viral News: రాత్రికి రాత్రే రోడ్డు పునర్నిమాణం.. ఉత్సాహంతో బైక్ చక్రాల మీద కాంక్రీట్ పోసిన వర్కర్లు..

రహదారిని వేసిన పౌర అధికారులు బైక్ టైర్లపై సిమెంట్ పోసి రోడ్డుని మరమత్తు చేశారు. అయితే తాను రాత్రి 11 గంటల వరకు షాపులోనే ఉన్నానని, అప్పటి వరకు ఎలాంటి పని జరగలేదని శివ సోదరుడు యువరాజ్ తెలిపాడు.

Viral News: రాత్రికి రాత్రే రోడ్డు పునర్నిమాణం.. ఉత్సాహంతో బైక్ చక్రాల మీద కాంక్రీట్ పోసిన వర్కర్లు..
Cement Road On Bike
Follow us

|

Updated on: Jun 29, 2022 | 6:41 AM

Cement Road On Bike: తాజా రోడ్డు వేస్తున్న సమయంలో కాంక్రీట్‌లో కూరుకుపోయిన బైక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) హల్ చల్ చేస్తోంది. అయితే తాము రోడ్‌ను మరమత్తు చేయడానికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని పౌర సంఘ అధికారులు  చెప్పారు. ఈ ఘటన తమిళనాడులోని(Tamilnadu) స్మార్ట్ సిటీ వేలూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

వెల్లూరులోని కొన్ని ప్రాంతాలలో రోడ్లను పునర్నిమాణం చేసే ఉత్సాహంలో కలిగంబల్ వీధికి చెందిన శివ అనే వ్యక్తి తన దుకాణం బయట ద్విచక్రవాహనాన్ని పార్క్ చేసి ఉదయం వచ్చాడు. అతను వాహనాన్ని తరలించడానికి ప్రయత్నించినప్పుడు.. దిగ్భ్రాంతికి గురయ్యాడు. రహదారిని వేసిన పౌర అధికారులు బైక్ టైర్లపై సిమెంట్ పోసి రోడ్డుని మరమత్తు చేశారు. అయితే తాను రాత్రి 11 గంటల వరకు షాపులోనే ఉన్నానని, అప్పటి వరకు ఎలాంటి పని జరగలేదని శివ సోదరుడు యువరాజ్ తెలిపాడు.

“ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా.. అధికారులు రహదారిని పునర్నిర్మిస్తున్నారు.. అది కూడా పార్క్ చేసిన వాహనం టైర్ల మీదుగా కాంక్రీట్ పోసి మరీ రోడ్డుని మరమత్తు చేస్తున్నారని బాధితుడు చెప్పాడు. తకుముందే రోడ్డు మరమత్తు విషయం ముందే తెలిసి ఉంటే బైక్ ను మరెక్కడైనా పార్క్ చేసి ఉండేవాళ్లమని తెలిపారు. ఇదేమిటి అని  కాంట్రాక్టర్‌ని ప్రశ్నించగా.. ధీమాగా సమాధానం చెప్పాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే వేలూరు, స్మార్ట్ సిటీ.. ఈ నేపథ్యంలో రహదారులను పునర్నిర్మించడానికి చూస్తోంది. తాజా ఘటనపై కార్పొరేషన్ కమిషనర్ పి అశోక్ కుమార్ మాట్లాడుతూ.. కలిగంబల్ వీధి రోడ్డుని పునర్నిర్మించాలని తాము పౌర సంఘం కోరలేదని చెప్పారు. అసలు కార్పొరేషన్‌కు తెలియకుండానే పనులు జరిగాయని అన్నారు.

“ఈ సంఘటన విన్న వెంటనే తాము షాక్ అయ్యామని ఇది కార్పొరేషన్‌కు చెడ్డ పేరు తెచ్చిందని అన్నారు.  ఇది పొరపాటు..  పరిపాలనా స్థాయిలో అంగీకరించలేమని అన్నారు. ఆ ప్రాంతంలో రోడ్డు వేయాలని కార్పొరేషన్ తరపున ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని అన్నారు. రోడ్డు వేయాలంటే టెండర్‌ వేసి తదుపరి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి అవగాహన… కార్పొరేషన్ అనుమతి లేకుండానే కాంట్రాక్టర్ స్థానికులతో అవగాహన కల్పించి రోడ్డు వేశారు. ఇది ఎమర్జెన్సీ పనుల విభాగంలో జరిగింది. ఈ సంఘటనపై ఇంజనీర్ (జోన్-II)కి షోకాజ్ నోటీసు జారీ చేశామని అన్నారు. తాను ఇప్పటికే సంఘటన స్థలాన్ని సందర్శించినట్లు.. మోటారుసైకిల్ ఇరుక్కున్న ప్రదేశం నుండి తొలగించమని కుమార్ చెప్పారు మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..