AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dogs Wedding: సాంప్రదాయ పద్దతిలో బ్యాండ్ బాజాలతో ఘనంగా కుక్కలపెళ్లి.. 400మంది హాజరు.. భారీ విందు.. కానుకల వెల్లువ

కల్లు తలపై పాగా ధరించగా, బసతి ఎరుపు రంగు దుస్తులతో మెరిసిపోయింది. వధూవరుల వలె అలంకరించడమే కాదు.. పెళ్లిని పండితుడు.. వేద మంత్రోచ్ఛారణల మధ్య పెళ్లి చేశారు.

Dogs Wedding: సాంప్రదాయ పద్దతిలో బ్యాండ్ బాజాలతో ఘనంగా కుక్కలపెళ్లి.. 400మంది హాజరు.. భారీ విందు.. కానుకల వెల్లువ
Dogs Unique Marriage
Surya Kala
|

Updated on: Jun 21, 2022 | 7:02 PM

Share

Dogs Wedding Feast: బీహార్‌లోని మోతిహారిలో కల్లు , బసతి అనే రెండు కుక్కలకు ఆచార సంప్రదాయాలతో ఘనంగా వివాహం జరిగింది. మనుషులకు చేసినట్లే.. హిందూసాంప్రదాయంలో అనుసరించే అన్ని కర్మలను పాటిస్తూ.. భాజాభజంత్రిల మధ్య పెళ్లి జరిగింది. కుక్కలు పెళ్ళికి ఊరేగింపులో వైభవంగా పెళ్లి పందిరిలోకి అడుగు పెట్టాయి. పూజ నుండి సింధూరం, మాంగళ్య ధారణ సహా అన్ని కర్మలు జరిగాయి. కల్లు , బసతిలు కొత్త బట్టలు ధరించాయి. కల్లు తలపై పాగా ధరించగా, బసతి ఎరుపు రంగు దుస్తులతో మెరిసిపోయింది. వధూవరుల వలె అలంకరించడమే కాదు.. పెళ్లిని పండితుడు.. వేద మంత్రోచ్ఛారణల మధ్య పెళ్లి చేశారు.

మోతిహారిలోని మజురాహా గ్రామంలో జరిగిన ఈ  వివాహం ఇప్పుడు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈ వివాహం మనుషులది కాదు.. రెండు కుక్కలకు పెళ్లి.. మనుషులకు చేసినట్లు చేయడంతో ప్రతి ఒక్కరి నోటా ఈ కుక్కల పెళ్లి మాటే..

మోతిహరి జిల్లా మజురాహా గ్రామంలో నివసిస్తున్న కుక్క యజమాని నరేష్ సాహ్ని..  కుక్క యజమానురాలు సబితా దేవిలు తమ రెండు కుక్కలకు ఘనంగా పెళ్లి చేయాలని చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపేందుకు బ్యాండ్ బాజా, డీజే ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు వివాహానికి హాజరైన వారికి భారీ విందు కూడా ఏర్పాటు చేశారు.  కుక్కలను ఊరేగిస్తూ.. పెళ్లి వేదిక వద్దకు తీసుకుని వస్తున్న సమయంలో హాజరైన జనం ఓ రేంజ్ లో డ్యాన్స్ చేశారు. అనంతరం  కల్లు , బసతిలకు పురోహితుడు వివాహ కతృవు నిర్వహించాడు.

గొప్ప విందు ఏర్పాటు ఈ వివాహానికి వధూవరులతో సహా దాదాపు నాలుగు వందల మంది హాజరయ్యారు. వివాహానికి హాజరైన అతిథులందరికీ భారీ విందు ఏర్పాటు చేశారు. అతిథులు వధూవరులకు డబ్బును బహుమతిగా ఇచ్చారు. కల్లు, బాసతి పెళ్లిళ్లకు హాజరైన అతిధులు మాట్లాడుతూ.. తమ జీవితంలో ఇలాంటి పెళ్లిని ఇంతకుముందెన్నడూ చూడలేదన్నారు. అదే సమయంలో  కల్లు , బసతిలకు పెళ్లి చేసిన పండిట్ ధర్మేంద్ర కుమార్ పాండే..మాట్లాడుతూ..  ప్రతి ఒక్కరూ కుక్కకు, ఆడకుక్కకు పెళ్లి చేయాలని, భైరవ స్వరూపులు కాబట్టి, అలాంటి పెళ్లి చేయడం వల్ల అనుకున్న ఫలితం లభిస్తుందని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…