Pakistan: ఆ దేశ ప్రజలను చాయ్‌ తాగొద్దంటున్న మంత్రి ప్రజలకు నీతులు చెప్పడం మాని..

‘చాయ్‌ తాగడం తగ్గించండి.. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడండి’ అంటూ పాకిస్తాన్‌ మంత్రి ఎహ్‌సాన్‌ ఇక్బాల్‌ ఆ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవును, ఈ విజ్ఞప్తి వెనుక రాబోయే విపత్తు నుంచి బయటపడాలనే తాపత్రయం కనిపిస్తోంది.

Pakistan: ఆ దేశ ప్రజలను చాయ్‌ తాగొద్దంటున్న మంత్రి ప్రజలకు నీతులు చెప్పడం మాని..

|

Updated on: Jun 21, 2022 | 9:04 PM

‘చాయ్‌ తాగడం తగ్గించండి.. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడండి’ అంటూ పాకిస్తాన్‌ మంత్రి ఎహ్‌సాన్‌ ఇక్బాల్‌ ఆ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవును, ఈ విజ్ఞప్తి వెనుక రాబోయే విపత్తు నుంచి బయటపడాలనే తాపత్రయం కనిపిస్తోంది. ఆయన ఇచ్చిన పిలుపు ఆ దేశ సంక్షోభానికి అద్దం పడుతోంది. నిజంగానే పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ కూడా శ్రీలంక తరహాలోనే పతనమైపోతోందా? అంటే అవుననే అంటున్నారు పరిస్థితులను గమనిస్తున్న ఆర్థిక నిపుణులు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌ ప్రభుత్వానికి విదేశాల నుంచి అప్పులు కూడా పుట్టడం లేదు. రాజకీయ అస్థిరత, ఉగ్రవాదులతో వచ్చిన సమస్యలకు తోడుగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఆ దేశానికి సమస్యగా మారాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలు చాయ్‌ తాగడం తగ్గించాలని పిలుపునిచ్చారు ఎహ్‌సాన్‌ ఇక్బాల్‌. నగదు కొరత కారణంగా దేశం టీ పొడిని దిగుమతి చేసుకోలేకపోతోందని తెలిపారాయన. గత ఏడాది పాకిస్తాన్‌ ప్రజలు రెండు కోట్ల రూపాయల విలువైన చాయ్‌ తాగారని లెక్కలు కూడా చెప్పారు సదరు మంత్రి. టీ పొడిని కూడా విదేశాల నుంచి అప్పుగా దిగుమతి చేసుకుంటున్నామని, చాయ్‌ తాడగం తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందామని పిలపునిచ్చారు. మరోవైపు రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ కూడా దిగజారుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ శ్రీలంక ఆర్థిక వ్యవస్థలా మారిపోతుందంటూ హెచ్చరించారు మిఫ్తా ఇస్మాయిల్. అయితే ప్రజలకు నీతులు చెప్పే ముందు ప్రభుత్వంలో ఉన్నవారు పొదుపు పాటించాలని సూచిస్తున్నారు పాక్‌ ప్రజలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Follow us