Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్, భార్య దిల్ కుష్.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..
కేరళలో ఓ జంట వెడ్డింగ్ ఫోటోషూట్ వైరల్ అవుతోంది. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత మళ్ళీ పెళ్ళి చేసుకుని ఆశ్చర్యపరిచారు. అనీష్, డాక్టర్ రజిత దంపతులు. ఎనిమిదేళ్ళ క్రితం ఈ జంట ప్రేమించుకున్నారు.
కేరళలో ఓ జంట వెడ్డింగ్ ఫోటోషూట్ వైరల్ అవుతోంది. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత మళ్ళీ పెళ్ళి చేసుకుని ఆశ్చర్యపరిచారు.
అనీష్, డాక్టర్ రజిత దంపతులు. ఎనిమిదేళ్ళ క్రితం ఈ జంట ప్రేమించుకున్నారు. వీరి పెళ్ళి కోసం అనిష్ బంధువులు రజిత తల్లిదండ్రులను కలిశారు. అయితే, ఈ పెళ్లిని రజిత కుటుంబీకులు వ్యతిరేకించారు. రజితను కట్టుబట్టలతో తీసుకెళ్లాలని చెప్పడంతో ఆ మరుసటి రోజే అనీష్ తల్లి, సోదరి కలిసి వచ్చి రజితను తమ ఇంటికి తీసుకెళ్లారు. సాయంత్రం ఓ ఆడిటోరియంలో వరుడి స్నేహితులు, బంధువుల సమక్షంలో అనీష్, రజిత సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రజితను ఉన్నత చదువులు చదివించాడు అనీష్. ఆమె ఓ ప్రైవేట్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్‌గా కొన్నాళ్ళు పనిచేసింది. అయితే ఎప్పుడు ఏ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నా భార్య మొహంలో వెలితి గమనించేవాడు అనీష్. అనీష్ తన గందరగోళాన్ని తోటి సామాజిక కార్యకర్త మీరా అజిత్‌కుమార్‌తో పంచుకున్నాడు. దాంతో ఆమె ఓ గ్రేట్ ఐడియా ఇచ్చింది. వెంటనే వారికి వెడ్డింగ్ ఫోటోషూట్ ఏర్పాటు చేసింది. అనీష్ ,రజిత వధూవరులుగా ముస్తాబయ్యారు. ఏడేళ్ల కుమార్తె అమ్ము సాక్షిగా పెళ్లి ప్రమాణాలను పునరుద్ధరించారు. ఈ సారి రజిత ముఖంలో చిరునవ్వు మెరిసింది. అట్టుకల్ దేవాలయం, శంకుముఖం బీచ్‌లో వెడ్డింగ్ ఫోటో షూట్ జరిగింది. సోషల్ మీడియాలో సైతం ఈ ఫోటోలు సూపర్ హిట్ అయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
Husbands: ఈ భార్యలు మాకొద్దు బాబోయ్.. భార్యబాధితులు వింత పూజలు వైరల్ అవుతున్న వీడియో..
ఆకాశంలో అద్భుత దృశ్యం.. వైరల్ అవుతున్న డ్రోన్ షో
అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుడు.. ఒక్కసారిగా..
మనాలీని కమ్మేసిన మంచు.. చిక్కుకుపోయిన వాహనాలు
బేగంపేట స్టేషన్లో దిగిన మహిళ.. సూట్కేస్ తెరిచి చూడగా షాక్
పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది
భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ

