Husbands: ఈ భార్యలు మాకొద్దు బాబోయ్‌.. భార్యబాధితులు వింత పూజలు వైరల్‌ అవుతున్న వీడియో..

Husbands: ఈ భార్యలు మాకొద్దు బాబోయ్‌.. భార్యబాధితులు వింత పూజలు వైరల్‌ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Jun 20, 2022 | 5:01 PM

ఈ భార్యలు మాకొద్దు బాబోయ్‌.. అంటున్నారు కొందరు భార్యా బాధితులు. అంతేకాదు ఒకడుగు ముందుకేసి వ్రతాలు కూడా చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కొందరు భార్యాబాధితులు చేసిన వినూత్న పూజాలు


ఈ భార్యలు మాకొద్దు బాబోయ్‌.. అంటున్నారు కొందరు భార్యా బాధితులు. అంతేకాదు ఒకడుగు ముందుకేసి వ్రతాలు కూడా చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కొందరు భార్యాబాధితులు చేసిన వినూత్న పూజాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఏడు జన్మలు కాదు.. ఏడు సెకన్లు కూడా ఈ భార్యలు మాకొద్దంటూ దేవుణ్ని వేడుకుంటూ వ్రతం చేశారు. .వట సావిత్రి పౌర్ణమికి కొన్ని రోజుల ముందు, కొందరు వ్యక్తులు రావి చెట్టుకు పూజలు చేసి ప్రదక్షిణలు చేశారు. వచ్చే ఏడు జన్మలు కాదు, ఈ ఏడు సెకన్లు కూడా ఈ భార్య మాకొద్దంటూ దేవుడిని వేడుకున్నారు. వాలుజ్‌ జిల్లాలోని ఆశ్రమంలో వట సావిత్రి పౌర్ణమి జరుపుకున్నారు. వట సావిత్రి పౌర్ణమి రోజున మహిళలు ఏడు జన్మలకూ ఒక్కరే భర్తగా రావాలని పూజలు చేస్తుంటారు. భార్యాబాధితుల సంఘం సభ్యులు మాత్రం.. ఇందుకు విరుద్ధంగా.. ఏడు సెకన్లు కూడా ఈ భార్యలు మాకొద్దు దేవుడా.. అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, పూజలు చేశారు. పురుషులు ప్రదర్శన చేస్తున్నప్పుడు, ఆశ్రమ వ్యవస్థాపకులు, సిబ్బంది సహా చాలా మంది హాజరయ్యారు. భార్య బాధితుల సంఘం ఎప్పుడూ తమ భార్యల వల్ల ఇబ్బంది పడే పురుషుల తరపున పోరాడుతుందన్నారు. జూన్‌ 13న జరిగిన ఈ వింత పూజలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!

Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..

Cris Gaera: బ్రెజిల్‌ మోడల్‌కి బంపర్‌ ఆఫర్‌.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..

Published on: Jun 20, 2022 05:01 PM