Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అర్ధరాత్రి వైన్స్‌ షాప్ వద్ద ఉద్రిక్తత.. దుకాణం బంద్ చేయాలని మహిళల ఆందోళన..దాడి చేసిన లేడీ బౌన్సర్లు

అర్ధరాత్రి నడిరోడ్డుపై మహిళలు హల్‌చల్‌ చేశారు. వైన్‌ షాప్ వద్ద బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: అర్ధరాత్రి వైన్స్‌ షాప్ వద్ద ఉద్రిక్తత.. దుకాణం బంద్ చేయాలని మహిళల ఆందోళన..దాడి చేసిన లేడీ బౌన్సర్లు
Women Protest Against Liquo
Follow us
Surya Kala

|

Updated on: Jun 26, 2022 | 5:29 PM

Women Protest Against Liquor Stores: చాలా ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా మహిళలు తరచూ నిరసనలు తెలుపుతున్నారు. కొన్ని సందర్భాల్లో మద్యం దుకాణాలపై దాడులు కూడా జరుగుతున్నాయి. రాళ్లు విసురుతున్నారు. కొన్నిసార్లులు వైన్‌ షాపుల ముందు కూడా బైఠాయించి నిరసనలు తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో ఘర్షణలు, పరస్పర దాడులు జరుగుతాయి. ఈ కోవలో జరిగిన ఘటన ఇప్పుడు మరోసారి వార్తల్లోనిలిచింది. ఏకంగా అర్ధరాత్రి నడిరోడ్డుపై మహిళలు హల్‌చల్‌ చేశారు. వైన్‌ షాప్ వద్ద బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

ఢిల్లీలోని ఓ వైన్ షాపు వెలుపల రెండు వర్గాల మహిళా నిరసనకారుల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారింది. వైన్‌ షాప్‌‌ను మూసివేయాలంటూ గురువారం అర్థరాత్రి మహిళలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మహిళలకు వైన్‌ షాపు సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వైన్ షాపులో ఉన్న మహిళా బౌన్సర్లు.. నిరసనకు దిగిన మహిళలను చితకబాదారు. ఆ ప్రాంతంలోనే విధులు నిర‍్వహిస్తున్న దక్షిణ ఢిల్లీలోని తిగ్డి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రంజిత్ జోక్యం వారికి నప్పజెప్పే ప్రయత్నం చేశాడు.

ఇవి కూడా చదవండి

ఫుల్‌ ఫైర్‌లో ఉన్న మహిళలు.. పోలీసులపై దాడి చేయడంతో అతడి డ్రెస్‌ చిరిగిపోయింది. దీంతో, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు 10 మందిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..